శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2022 (08:39 IST)

వ్యాపారంలో లాభాలు రావాలని... గ్రామవాసుల ముందు భార్యతో నగ్నస్నానం

Head bath
ఓ మాంత్రికుడు మాటలు నమ్మిన కట్టుకున్న భర్త... తాను చేస్తున్న వ్యాపారంలో లాభాలు రావాలని ఆశపడుతూ భార్యతో అనేక మంది ముందు నగ్నస్నానం చేయించాడు. ఈ దారుణం మహారాష్ట్రంలోని పూణె జిల్లాలో జరిగింది. ఇందుకు తమ కుమారుడి తల్లిదండ్రులు కూడా సహకరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పూణెకు చెందిన ఓ వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు. ఇందులో మరిన్ని లాభాలు, ఇంట్లో సుఖ శాంతులు నెలకొనేందుకు ఏం చేయాలన్న అంశంపై ఓ మాంత్రికుడిని సంప్రదించాడు. అందరి ముందు కట్టుకున్న భార్యతో నగ్నస్నానం చేయిస్తే తిరుగుండదని మాంత్రికుడు సలహా ఇచ్చాడు. 
 
వ్యాపారంలో లాభాలు రావాలని, చేతికి డబ్బు మరింతగా రావాలని, ఇంట్లో సుఖశాంతులు నెలకొనాలన్న దురాశతో ఆ వ్యాపారి మాంత్రికుడు చెప్పిన మాటలకు సరేనన్నాడు. దీనికి అతడి తల్లిదండ్రులు కూడా సమ్మతించారు. మాంత్రికుడు చెప్పినట్టుగా వివిధ రకాల పూజల అనంతరం తన భార్యను అందరి ముందు వివస్త్రను చేసి నగ్న స్నానం చేయించాడు. 
 
ఈ స్నానం చేస్తున్న సమయంలో చుట్టూవున్నవారు కూడా సినిమా చూసినట్టు చూశారేగానీ ఒక్కరంటే ఒక్కరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మాంత్రికుడు చెప్పినట్టుగా పూజలు ముగిసిన తర్వాత బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని, అతడి తల్లిదండ్రులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మాంత్రికుడి కోసం గాలిస్తున్నారు.