ఆదివారం, 13 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2022 (14:59 IST)

విజయ్ దేవరకొండతో రష్మికతో నిశ్చితార్థం జరిగిందా?

టాలీవుడ్‌లో స్టార్లుగా వెలుగొందుతోన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు ఇటీవలే మాల్దీవులకు చెక్కేసిన సంగతి తెలిసిందే. తాజాగా వీళ్లిద్దరి పెళ్లి ఫొటో వైరల్‌గా మారింది. కన్నడ మూవీ 'కిర్రాక్ పార్టీ'తో రష్మిక మందన్నా హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత 'ఛలో'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిపోయింది. 
 
అలాగే, విజయ్ దేవరకొండ 'పెళ్లి చూపులు' చిత్రంతో హీరోగా వచ్చాడు. అతడు కూడా కొన్ని సినిమాలే చేసి స్టార్‌గా ఎదిగాడు. దీంతో ఇద్దరూ సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తున్నారు. 
 
రష్మిక మందన్నా సినిమా కెరీర్‌ను మొదలు పెట్టిన తొలినాళ్లలోనే కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. ఆ వెంటనే అతడితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ, అర్థాంతరంగా ఈ బంధానికి బ్రేకప్ చెప్పేసింది. 
 
ఇక, తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తునే ఉన్నాయి. రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ కలిసి 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి చిత్రాల్లో జంటగా నటించారు. 
 
అప్పటి నుంచి వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఈ చిన్నది తరచూ విజయ్ ఇంట్లో కనిపిస్తుంటుంది. దీంతో వీళ్ల పెళ్లి కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ మాత్రం రావడం లేదు.