బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (21:02 IST)

శ్రీవల్లి పారితోషికం శ్రీహరికోట రాకెట్‌లా దూసుకెళ్తోంది

Rashmika Mandanna
పుష్ప చిత్రంతో దేశంలోనే కాక ప్రపంచంలోని పలు దేశాల్లో గుర్తింపు తెచ్చుకుంది శ్రీవల్లి ఫేమ్ రష్మిక మందన. టాలీవుడ్ వెండితెరపై గ్లామర్ హొయలు పోతుంది.

 
తనకు వస్తున్న సూపర్ క్రేజ్ దృష్ట్యా రష్మిక మందన పారితోషికాన్ని భారీగా పెంచేసిందట. ఆమె పారితోషికం ఫిగర్ చూసి శ్రీహరికోట రాకెట్ వేగంతో వెళ్తుందే అంటున్నారట. బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీల్లో చేతి నిండా సినిమాలతో బిజీగా వుంది.

 
అమితాబ్‌తో కలిసి గుడ్ బై చిత్రంలో, సిద్ధార్థ మల్హోత్రాతో మిషన్ మజ్నులో నటిస్తుంది. ఇదిలావుంటే పుష్ప 2 చిత్రానికి ఏకంగా రూ. 4 కోట్లు తీసుంకుంటోందట. దీనితో కొత్త సినిమాకి సంతకం చేయాలంటే రూ. 5 కోట్లు అడుగుతుందట.

 
అంతేకదా... దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది సామెత. రష్మిక మందన ఆ ఫార్ములాను చాలా త్వరగా అప్లై చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే పుష్ప ది రూల్ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది.