1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 సెప్టెంబరు 2022 (22:47 IST)

బిగ్ బాస్‌కు చచ్చినా వెళ్లను.. ఆమెకు సపోర్ట్ చేసిన విష్ణుప్రియ (video)

Anchor Vishnupriya
బిగ్ బాస్ కార్యక్రమంపై పలువురు సెలెబ్రిటీలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విష్ణు ప్రియ బిగ్ బాస్ కార్యక్రమం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తనకు బిగ్ బాస్ కార్యక్రమం అంటే నచ్చదని తనకు ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చిన చస్తే వెళ్ళనంటూ కామెంట్స్ చేశారు. 
 
నిర్వాహకులు తనకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చిన ఈ కార్యక్రమంలో పాటిస్పేట్ చేయనని తేల్చేశారు. కాగా ఈమె వాంటెడ్ పండుగాడ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి. 
 
సీజన్ సిక్స్‌లో మాత్రం తనకు బాగా కావాల్సిన వాళ్ళు ఉన్నారని అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్ నేహా చౌదరికి తన మద్దతు తెలుపుతున్నానని ఈ సందర్భంగా ఈమె బిగ్ బాస్ కంటెస్టెంట్ నేహా చౌదరికి సపోర్ట్ చేశారు. బిగ్ బాస్ హౌస్‌లో నేహా చౌదరి చాలా జెన్యూన్‌‍గా గేమ్ ఆడుతున్నారని కామెంట్స్ చేశారు.