ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (21:37 IST)

నారాయణ నారాయణ.. నాగన్నా నాగన్నా.. ఆ ఇద్దరి మధ్య కౌంటర్లు

narayana
బిగ్ బాస్ షోపై సీపీఐ నారాయణ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఇంతవరకు పెద్దగా నారాయణ వ్యాఖ్యలను పట్టించుకోని.. అక్కినేని నాగార్జున శనివారం ఎపిసోడ్‌లో మాత్రం నారాయణకు చురకలంటించారు. నాగార్జున రోహిత్ మెరీనా జంటకు అందరూ ఉన్నారని ఇబ్బంది పడవద్దని మీకు లైసెన్స్ ఉందని సూచనలు చేశారు.
 
ఇద్దరూ టైట్ హగ్ ఇచ్చుకోవాలని నాగ్ సూచించగా రోహిత్ మెరీనా నాగ్ చెప్పిన విధంగా చేశారు. ఆ తర్వాత నాగ్ ఈ జంటను చూపిస్తూ 'నారాయణ నారాయణ వాళ్లిద్దరూ మ్యారీడ్' అని కామెంట్ చేశారు. 
 
అయితే నాగార్జున కౌంటర్ తన దృష్టికి రావడంతో నారాయణ సైతం వెంటనే రియాక్ట్ అయ్యారు. 'నాగన్నా.. నాగన్నా మీ బిగ్ బాస్ షోలో మీరు పెళ్లైన వారికే లైసెన్స్ ఇచ్చారు.. వారికే శోభనం గది ఏర్పాటు చేశారు.. మరి మిగతా వాళ్లు అంతా ఏమయ్యారన్నా?.. వాళ్లకు పెళ్లిళ్లు కాలేదు కదా?.. వాళ్లు బంధువులు కాదు కదా? నూరు రోజుల పాటు వాళ్లు కూడా ఏం చేస్తారో అది కూడా చెప్పన్నా' అని అంటూ నారాయణ కామెంట్స్ చేసారు.
 
నాగార్జున ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. నాగ్ శ్రేయోభిలాషులు మాత్రం నారాయణ నోరు మంచిది కాదని నాగార్జున అనవసర వివాదాలకు దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు.