గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (15:49 IST)

సస్పెన్స్, థ్రిల్లర్ Eట్లు సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది - సుమన్

suman,  Pratani Ramakrishna Goud, Lion Sai Venkat, Rama Satyanarayana
suman, Pratani Ramakrishna Goud, Lion Sai Venkat, Rama Satyanarayana
`మా అన్నయ్య రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు  మన మధ్య లేకపోవడం చాలా బాధాకారం. తనతో  నాకు మంచి బాండింగ్ ఉంది. ఈ రోజు నేను  ఈ స్టేజ్ పై ఉన్నాను అంటేఆయన సలహాల  వలనే. సినిమా ఇండస్ట్రీ లో ఆర్టిస్ట్ గా దర్శకుడితో, నిర్మాతలతో  ఓబీడీఎంట్ గా, డెడికే టెడ్ గా, సిన్సియర్ గా ఎలా ఉండాలో  చెప్పేవారు. ఆయన సలహాలను పాటించడం వలనే ఇప్పటివరకు ఇండస్ట్రీ లో ఉన్నాను` అని సీనియర్ హీరో సుమన్ గుర్తుచేసుకున్నారు. Eట్లు  సినిమా ట్రైల‌ర్‌ వేడుక‌లో ఆయ‌న పాల్గొన్నారు.
 
శ్రీజ ఆర్ట్స్ & బాచిన వైష్ణవ్ చౌదరి ఫిల్మ్స్ పతాకాలపై అమీర్, ప్రణీత, దీపిక జంటగా పూదారి రాజా గౌడ్, డా,,ఎలిశాల లింగం పూదరి రాజశేఖర్ గౌడ్. బాచిన నాగేశ్వరరావు ల నిర్మాణంలో వస్తున్న సినిమా “Eట్లు”. ఈ సినిమాకు పందిళ్లపల్లి రోషి రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం “Eట్లు”.(మీకు తెలుసా అనేది ట్యాగ్ లైన్).ఇంతకుముందు మంత్రి హరిష్ రావు గారు విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో  చిత్ర టీజర్ ను,ట్రైలర్ ను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన సీనియర్ హీరో సుమన్,
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్,లయన్ సాయి వెంకట్  లు చిత్ర టీజర్ ను విడుదల చేయగా, నటుడు కుప్పిలి శ్రీనివాస్,నిర్మాత తుమ్మల రామ సత్యనారాయణ, ఉప్పల మెట్టయ్య, పెంచల స్వామి లు చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రతాప్ రెడ్డి, సీనియర్ నటుడు నారాయణ రావు, నటుడు అనిల్ బుజ్జి లతో పాటు చిత్ర యూనిట్  పాల్గొన్నారు. ముందుగా రెబల్ స్టార్ కృష్ణం రాజుగారి మృతికి  సంతాపాన్ని తెలియజేస్తూ ఒక నిమిషం మౌనం పాటించారు. అనంతరం  
 
ఇంకా సుమ‌న్ మాట్లాడుతూ, ఇట్టు సినిమా విషయానికి వస్తే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఇందులో నాది పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాను. దర్శకుడు మంచి స్టోరీ చాలా చక్కగా డైరెక్షన్ చేశాడు.  నిద్రలేకుండా సినిమా కొరకు చాలా కష్టపడ్డారు చిత్ర నిర్మాతలు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా చాలా బాగుంటుంది.అందరూ ఈ సినిమాను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ఈ చిత్ర ట్రైలర్, టీజర్ చాలా బాగున్నాయి. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకు డి ఓ పి చక్కటి విజువల్స్ అందించాడు.హీరో  హీరోయిన్ ఇద్దరూ చాలా బాగా నటించారు. మ్యూజిక్ అద్భుతంగా ఉంది.ఈ సినిమాలో సుమన్ వంటి మంచి నటులు నటించడం చాలా హ్యాపీ గా ఉంది. దర్శకుడు రొశి రెడ్డి రాసుకున్న కథను సెలెక్ట్ చేసుకొని తీసిన నిర్మాతలకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.
 
చిత్ర నిర్మాత పూదరి రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ..మా టీజర్, ట్రైలర్ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. సస్పెన్స్  థ్రిల్లర్ కథతో వస్తున్న సుమన్ గారు  ఇందులో నటించడమే కాకుండా మాకు సలహాలు, సూచనలు ఇస్తూ  మాకెంతో సపోర్ట్ నిలిచారు వారికి మా ధన్యవాదాలు.మంచి కాన్సెప్ట్ తో వచ్చే “Eట్లు’ సినిమా ప్రేక్షకులలందరినీ కచ్చితంగా అలరిస్తుంది అని తెలిపారు.
 
మరో నిర్మాత డాక్టర్ ఎలిశాల లింగం   మాట్లాడుతూ..మా కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. సీనియర్ నటులు సుమన్ గారు, నారాయణ రావు గారు వంటి సీనియర్ నటులు మా సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి కథతో వస్తున్న ఈ సినిమాను అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
 
చిత్ర దర్శకుడు పందిళ్లపల్లి రొశి రెడ్డి మాట్లాడుతూ..నమ్మకం అనేది చాలా గొప్ప విషయం.నేను మొదలు పెట్టిన ఈ సినిమా ఇబ్బందులు ఎదుర్కొంటున్న  సమయంలో ఈ కథను నమ్మి నాపై ఉన్న నమ్మకంతో చిత్ర నిర్మాతలు ఈ సినిమా చెయ్యడానికి ముందుకు వచ్చారు.వారికి నా ధన్యవాదాలు. చాలా మంది నటులు నటించి వెళ్ళిపోతారు. కానీ సుమన్ గారితో పాటు, మరికొందరు నటులు,టెక్నిషియన్స్ ఈ సినిమాను ఓన్ చేసుకొని వర్క్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. ఈ సినిమా మ్యూజిక్ విడుదల విషయంలో  ఏ ఆర్ ఎంటర్టైన్మెంట్ అమిత్ అగర్వాల్, ఓల్గా రాజు గార్లు బాగా సపోర్ట్ చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో వస్తున్న ఈ చిత్రంలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రాన్ని అందరూ ఆధరించి ఆశీర్వదించాలి అన్నారు.
 
చిత్ర హీరో అమీర్ మాట్లాడుతూ.. మమ్మల్ని నమ్మి సీనియర్ నటులైన సుమన్ గారు నారాయణరావు గారు ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు థాంక్స్.మీడియా సపోర్ట్ లేనిదే మేము ఎంత కష్టపడినా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉండదు.కాబట్టి మీడియా మిత్రులకు థాంక్స్. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
 
ఇంకా నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, లయన్ సాయి వెంకట్, సీనియర్ నటుడు నారాయణ,  కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.