ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (20:51 IST)

"సీతారామం"సక్సెస్.. భాషతో పనిలేదు.. కెమిస్ట్రీ అదిరింది.. అందరికీ కృతజ్ఞతలు

Seetha Ramam
Seetha Ramam
"సీతారామం"సక్సెస్ పట్ల సినీ యూనిట్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు ఆ సినిమా హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మృణాల్ ఠాగూర్ కృతజ్ఞతలు తెలిపారు. మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం హిందీలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం 60టీస్ 80టీస్‌ల నాటి పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది. 
 
సీతారామం సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలు ప్రేక్షకులను థియేటర్లకు వెళ్లేలా చేశాయి. ప్రేక్షకులను కట్టిపడేసే కథాంశం, స్క్రీన్‌ప్లే, మనోహరమైన కెమిస్ట్రీకి అభిమానుల నుండి అద్భుతమైన ప్రశంసలు అందుకుంది.
 
హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామంలో సౌత్ సూపర్ స్టార్, రష్మిక మందన్న కూడా కీలక పాత్రలో నటించారు. దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ పాత్రను పోషించాడు. సీతా మహాలక్ష్మి పాత్రలో మృణాల్ ఠాకూర్ ప్రేమ సినిమాపై ఆసక్తిని పెంచింది. 
 
దక్షిణాదిన మాత్రమే కాకుండా ఉత్తరాదిన కూడా ఈ సినిమాకు మంచి క్రేజ్ లభిస్తోంది. ఈ సినిమా విజయం సాధించిన సందర్భంగా చిత్ర నిర్మాత‌లు, న‌టీన‌టులు విలేకరుల స‌మావేశాన్ని ఏర్పాటు చేసి సినిమాపై త‌మ ప్రేమ‌ను కురిపిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
 
సినిమా విజయం గురించి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ, "ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకమైనది. ఈ సినిమాలో తన నటనను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు" అని చెప్పారు. 
Seetha Ramam
Seetha Ramam
 
దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. , "ఈ చిత్రం వేలాది మంది కళాకారులు, ప్రతిభావంతుల కృషితో తెరకెక్కింది. ఈ సన్నివేశాల చిత్రీకరణలో ఎంతో అందం దాగివుంది. నేను ఈ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్నాను. ఇది నమ్మశక్యం కానిదిగా ఉంది, ఈ సినిమాను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు నా అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను." అన్నారు.
 
పెన్ స్టూడియోస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జయంతిలాల్ గడా మాట్లాడుతూ, "'సీతారామం" సినిమా దేశ వ్యాప్తంగా హిట్ కొట్టింది. 'RRR', 'విక్రమ్' తర్వాత మరోసారి భాషకు ఎటువంటి అడ్డంకులు లేవు అంటూ సీతారామం నిరూపించింది.. అన్నారు. 
 
ఈ చిత్రం తెలుగులో ఆగష్టు 5న విడుదలైంది. హిందీలో సెప్టెంబర్ 2న విడుదలైంది. మాస్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో నడుస్తోంది. ఈ చిత్రం మిలియన్ల మంది హృదయాలను హత్తుకుంటుంది.