ఆదివారం, 26 మార్చి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated: శనివారం, 3 సెప్టెంబరు 2022 (10:49 IST)

ఓవర్సీస్‌లో దూకుడు తగ్గని "సీతారామం"

Sita Ramam movie review
సల్మాన్ దుల్కర్, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన చిత్రం "సీతా రామం". ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ సమర్పణలో ఆయన కుమార్తె స్వప్న దత్ నిర్మించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. గత నెల 5వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోకాకుండా యూఎస్‌లోను ఈ సినిమా భారీస స్థాయిలో విడుదలైంది. 
 
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అనుకున్నదానికంటే అమితమైన స్పందన వచ్చింది. క్లాసికల్ హిట్ అనిపించుకుని దూసుకుపోయింది. ఇక యూఎస్‌లో ఈ సినిమా అంచనాలకి మించిన ఆదరణను సొంతం చేసుకుంది. అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగిన సినిమా నిలిచింది. 
 
ఇంతవరకు ఈ సినిమా అక్కడ 1.35 మిలియన్ ప్లస్ డాలర్స్‌ను రాబట్టుకుంది. త్వరలోనే 1.5 మిలియన్ మార్క్ డాలర్లను టచ్ చేయొచ్చని అంటున్నారు. బలమైన కథాకథనాలు, సున్నితమైన భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలకి తోడు, విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీత ఈ సినిమా విజయంలో ప్రధాన భూమికను పోషించింది.