శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2022 (19:40 IST)

సీతారామం రివ్యూ రిపోర్ట్.. కథ అదిరింది.. అవే సినిమాకు ప్లస్ పాయింట్స్

Sita Ramam movie review
Sita Ramam movie review
సినిమా : సీతారామం
నిర్మాత: అశ్వినీదత్
దర్శకత్వం: హను రాఘవపూడి
తారాగణం: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్, రష్మిక మందన్న, సుమంత్, తరుణ్ భాస్కర్, భుమిక చావ్లా, గౌతం వాసుదేవ్ మీనన్, వెన్నెల కిషోర్, మురళి శర్మ, ప్రకాశ్ రాజ్, శత్రు తదితరులు
కెమెరా: పి. ఎస్. వినోద్, శ్రేయాస్ కృష్ణ
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
విడుదల: 5 ఆగస్టు 2022
 
"మహానటి" తీసిన బ్యానర్ కనుక ఆ స్థాయిలో ఏదో సర్ప్రైజ్ జరుగుతుందన్న అంచనాలు ఈ చిత్రంపై విడుదల ముందు వరకు మీడియా వర్గాల్లోనూ, క్లాస్ ప్రేక్షకుల్లోనూ ఉన్నాయి. 
 
"లెటర్స్ టు జూలియట్" అనే 2010 నాటి సినిమాలోని పాయింట్ తో "మహానటి" ఫార్మాట్‌ని తూచా తప్పకుండా రాసుకున్న స్క్రిప్ట్ ఇది. అందులో విజయ్ దేవరకొండ-సమంత సావిత్రి గురించి తెలుసుకోవడానికి బయలుదేరినట్టు ఇందులో తరుణ్ భాస్కర్, రశ్మిక సితామహాలక్ష్మి ఆచూకీ తెలుసుకోవడానికి బయలుదేరతారు. వాళ్లున్నది 1985లో. వాళ్ల పని ఆమెకు 1965 నాటి ఉత్తరం అందజేయడం. ఎవరిదా ఉత్తరం? ఏమా కథ? ఆ ఉత్తరంలో ఉంది? ఈ ప్రశ్నలకి సమాధానాలు ఒక్కొక్కటిగా తెలుస్తుంటాయి క్లైమాక్స్ వరకు అదే కొనసాగుతోంది. 
Sita Ramam movie review
Sita Ramam movie review
 
రామ్ అనబడే ఒక ఆర్మీ ఆఫీసర్‌కి, అతను కాపాడిన కొందరు వ్యక్తులకి మధ్యలో నడిచే కథే ఈ "సీతారామం".
కథంతా పీరియడ్ బ్యాక్ డ్రాప్‌లో నడుస్తుంది. 
 
విశ్లేషణ.. వింటేజ్ ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్, మెకప్ అన్నీ బాగానే కుదిరాయి. చూడడానికి చాలా రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువల విషయంలో అస్సలు తక్కువ చెయ్యలేదు. 
 
సినిమా ఎలా ఉందని అడిగితే వింటేజ్ కారు ప్రయాణంతో పోల్చి చెప్పొచ్చు. వింటేజ్ కారులో ప్రయాణం బాగానే ఉంటుంది కానీ, బొత్తిగా స్పీడ్ ని 40 దగ్గర లాక్ చేసినప్పుడే నీరసమొస్తుంది. ఈ సినిమా చూస్తున్న అనుభవమూ అలాంటిదే. 
 
ప్రధమార్థంలో చాలాసేపు కథ స్పీడుగా నడవక అక్కడక్కడే తచ్చాడుతూ ప్రేక్షకుల్ని ఒకరి మొహాలు ఒకరు చూసుకునేలా చేస్తుంది. కానీ క్రమంగా స్పీడందుకుంది. అంటే నలభై స్పీడల్లా 60 అయ్యిందన్నమాట. అప్పటికి ప్రేక్షకులు అలవాటు పడి ఈ బండి ఇంకింతకంటే స్పీడు వెళ్లదని గ్రహించి సర్దుకుపోతారు. 
 
సహజంగా ఏ సినిమా అయినా ప్రేక్షకుల అటెన్షన్‌ని లాగేసుకోవాలి. కానీ కొన్ని మాత్రం అటెన్షన్‌తో ఓపిగ్గా చూస్తేనే బాగుంటాయి. అలా చూసేవాళ్లకి ఫీల్ గుడ్ సినిమా టైపులో బాగానే ఉంటుంది ఈ చిత్రం. 
 
త్యాగం, ధైర్యం, దేశభక్తి, వృత్తిపట్ల అంకితభావం, సీనియర్స్ పట్ల గౌరవం ఉన్న పాజిటివ్ గుణాలున్న ఒక ఆర్మీ ఆఫీసర్ మన హీరో బాగానే చేశాడు. ప్రాణభయం, స్వార్థం, జూనియర్స్ పట్ల అసూయ, కుళ్లుగుణం ఉన్న మరొక ఆర్మీ ఆఫీసర్ కూడా ఉంటాడు. వీళ్లిద్దరి మధ్యలో ట్రాక్ నడుస్తుంది.  
Sita Ramam movie review
Sita Ramam movie review
 
కథగా తీసుకుంటే ఇది విషాదాంతం. ప్రేమికుడిగా కంటే గౌరవింపదగిన వ్యక్తిగా ఉంటుంది ఇందులోని హీరో పాత్ర. 
టెక్నికల్‌గా తీసుకుంటే కెమెరా వర్క్‌కి, ఆర్ట్‌కి, కాస్ట్యూమ్స్‌కి ఫుల్ మార్క్స్ వేసుకోవచ్చు. ఎటొచ్చీ స్క్రిప్ట్‌లో లూజ్ ఎండ్స్ మాత్రం చాలానే ఉన్నాయి.
 
రైలులో సునీల్ కామెడీ అస్సలు నవ్వు రాలేదు. అలాగే వెన్నెల కిషోర్ కామెడీ కూడా అతికీ అతక్కుండా ఉంది. మిలిటరీ ఎపిసోడ్స్, క్లైమాక్స్, హీరో హీరోయిన్స్ మధ్యలో నడిపిన రొమాంటిక్ ట్రాక్ బాగున్నాయి. పాటలు క్లాస్ ఆడియన్స్ మెచ్చే విధంగా ఉన్నాయి. 
  
దుల్కర్ సల్మాన్ తన క్యారెక్టర్‌కి పూర్తిగా న్యాయం చేసాడు. ఈ సినిమాకి హైలైట్ అతనే. మృణాల్ సేన్ చూడ్డానికి బాగుంది, చెయ్యాల్సిన విధంగా నటన కూడా చేసి మెప్పించింది. క్యాస్టింగ్ పరంగా హీరో, హీరోయిన్స్ ఇద్దరూ యాప్ట్. 
 
సుమంత్‌కి మంచి నెగటివ్ క్యారక్టరే దొరికింది. అతిథిపాత్రలో ఒక సీన్లో భూమిక కనిపించింది. రష్మిక మాత్రం ఇన్నాళ్లూ తాను వేసిన పాత్రలకి పూర్తి భిన్నంగా కీలకమైన సపోర్టింగ్ రోల్‌లో కనిపించింది. దర్శకుడు క్లైమాక్స్ లో రెండు ట్విస్ట్స్‌ని హ్యాండిల్ చేసిన తీరు బాగుంది. అయినప్పటికీ క్లాస్ టేస్ట్ ఉండి, థియేటర్ల బాగుకోసం చూడాలనుకునే వారు ఈ వీకెండ్ థియేటర్లలో చూడొచ్చు. 
 
రేటింగ్: 2.75/5