గురువారం, 21 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 30 జులై 2022 (18:26 IST)

అన్నీ ఎమోష‌న్స్ తో వున్న‌ సీతారామం లాంటి క‌థ‌లు రేర్‌గా వ‌స్తుంటాయి - మృణాల్ ఠాకూర్‌

Mrinal Thakur
Mrinal Thakur
స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకంగా చిత్రం 'సీతారామం'.  హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులని మెస్మరైజ్ చేసి చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఆగస్ట్5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో క‌థానాయిక మృణాల్‌ ఠాకూర్ శ‌నివారంనాడు విలేఖరుల సమావేశంలో ముచ్చటించారు. ఆమె పంచుకున్న 'సీతారామం' చిత్ర విశేషాలివి.
 
మీ  కెరీర్ సీరియ‌ల్‌తో మొద‌లైంది. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ చేయ‌డం ఎలా అనిపిస్తుంది?
నా మొద‌టి సీరియ‌ల్ బాలీవుడ్‌లో `కుంకుమభాగ్య‌.` అది అన్ని భాష‌ల్లో డ‌బ్ అయింది నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇలా తెలుగులో వైజ‌యంతి మూవీస్ బేన‌ర్‌లో హీరోయిన్‌గా చేస్తాన‌ని అనుకోలేదు. అందులోనూ దుల్క‌న్ స‌ల్మాన్ హీరోగా, అశ్వ‌నీద‌త్ నిర్మాత‌గా చేస్తున్న సినిమా నాకు ఇదో గొప్ప అచీవ్ మెంట్‌. 
 
సీత పాత్ర‌కు ద‌ర్శ‌కుడు మిమ్మ‌ల్ని ఎలా ఎంపిక‌ చేశారు?
హిందీ జ‌ర్సీ రీమేక్ షూటింగ్ జ‌రుగుతుండ‌గా నేను చంఢీగ‌ర్‌లో వున్నాను. హ‌నుగారు ఫోన్ చేసి ఒక‌సారి క‌ల‌వాల‌న్నారు. అలా ముంబైలో కాఫీషాప్‌లో క‌లిశాం. ఆ త‌ర్వాత పూర్తి క‌థ‌ను ఆఫీసులో విన్నా. ఆయ‌న నెరేష‌న్ చేసే విధానం నా ఎగ్జైట్‌మెంట్ చూసి వెంట‌నే ఫిక్స్ చేశారు.
 
మ‌హాన‌టి సినిమా చూశార‌ట‌దా?
నా మొద‌టి సినిమా ల‌వ్ సోనియా. ఫిలింఫెస్టివ‌ల్ మెల్‌బోర్న్‌లో జ‌రుగుతుండ‌గా అక్క‌డ నాగ్ అశ్విన్ గారు క‌లిశారు. అక్క‌డ మ‌హాన‌టి సినిమా గురించి నాగ్ వ‌చ్చారు. అందులో కీర్తిసురేష్ అద్భుతంగా న‌టించింది. అలా నాగ్ గారు ప‌రిచ‌యం  వైజ‌యంతి ఫిలింస్‌లో నేను భాగ‌మ‌య్యాను.  
 
ఆ త‌ర్వాత సినిమాలు చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం?
ల‌వ్ సోనియా హిట్ త‌ర్వాత కొంత‌కాలం గ్యాప్ వ‌చ్చింది. మా అమ్మ‌గారు ఏదైనా సీరియ‌ల్ చేయ‌వ‌చ్చుగ‌దా అన్నారు. నాకు మంచి అవ‌కాశం వ‌స్తుంద‌నే న‌మ్మ‌కంతో వున్నాను. అలా న‌మ్మ‌కం నిజ‌మైంది. నా ల‌వ్ సోనీయా సినిమా అన్ని భాష‌ల్లోనూ వ‌చ్చింది. 
 
సీత పాత్ర ఎలా అనిపించింది?
సీతా రామంలో సీత పాత్ర చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ప్ర‌తి న‌టికి సీత పాత్ర చేయాల‌నే డ్రీమ్ వుంటుంది. నేను ధైర్యంగా చెబుతున్నా. ఇది నా పుట్టిన‌రోజు గిఫ్ట్‌గా భావిస్తున్నాను.  
 
రొమాంటిక్ సినిమాలో చేయ‌డం ఎలా వుంది?
సీతారామం ఇండియ‌న్ సినిమాలో బేక్ త్రూ అవుతుంది. నాకు క‌థ‌క్ అంటే ఇష్టం. ఇందులో కొరియోగ్రాఫ‌ర్ బృంద‌గారు చాలా ఎక్సెప్రెష‌న్స్ చూపించారు. ఇది రొమాంటిక్ ప్రాజెక్ట్‌. సీతారామంలో నా పాత్ర‌లో ఐదు షేడ్స్ వుంటాయి. కెరీర్‌లో అరుదుగా వ‌చ్చే పాత్ర ఇది. దుల్క‌ర్ స‌ల్మాన్‌తో న‌టించ‌డం చాలా ఆనందంగా వుంది. 
 
సీత పాత్ర‌లో  రొమాంటిక్ ఎలా వుంటుంది?
ట్రైల‌ర్‌లోనే మీకు క‌నిపిస్తుంది. సినిమాలో చూస్తే మీకు బాగా అవ‌గాహ‌న అవుతుంది.
 
ర‌ష్మిక‌తో న‌టించ‌డం ఎలా అనిపిస్తుంది. మీ ఇద్ద‌రి కాంబినేష‌న్ సీన్స్ వున్నాయా?
ర‌ష్మిక‌లో ఎన‌ర్జీ లెవ‌ల్ ఎక్కువ‌. త‌ను ఒక‌రోజు ముంబై, మ‌రో రోజు చెన్నై, ఫారిన్ ఇలా చలాకీగా తిరుగుతుంది. సెట్లో చాలా హుషారుగా వుంటుంది. అంద‌రినీ చాలా కేర్ తీసుకుంటుంది. త‌ను కేర్ గా వుంటుంది. మా కాంబినేష‌న్ సీన్స్ సినిమాలో చూడాల్సిందే.
 
 క‌థ 1960లోనిది మీరు 2020 గాళ్‌గ‌దా ఎలా పాత్ర‌ను బేలెన్స్ చేశారు?
ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఇన్‌పుట్స్‌తోపాటు స్వ‌ప్న‌గారి సూచ‌న‌లు తీసుకున్నాను. నేను కుంకుమ భాగ్య చేస్తుండ‌గా మా అమ్మ‌మ్మ‌నుంచి కొన్ని ఇన్‌పుట్స్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు సీత పాత్ర‌కూ తీసుకున్నాను. ఇందులో డైలాగ్ లు చాలా పొయిటిక్‌గా వుంటాయి. చిన్న చిన్న విష‌యాల్లోనూ ద‌ర్శ‌కుడు కేర్ తీసుకోవ‌డం విశేషం. నేను 2022 గాళ్ అయినా 1960 గాళ్‌గా మీకు బాగా న‌చ్చుతాను.
 
మీకు ప‌ర్స‌న‌ల్‌గా సీత‌గా వుంటారా? స‌త్య‌భామ‌గానా, రుక్ష్మిణిగా వుంటారా?
ముగ్గురు మిక్స్ చేస్తే మృణాల్ ఠాగూర్ అవుతుంది. ఏది ఏమైనా ప్ర‌తి ఒక్క‌రిని నుంచి ఒక్కో విష‌యం నేర్చుకుంటాం. అలా ఈ సినిమాలో ప్ర‌తి వారినుంచి నేర్చుకుని బెట‌ర్ అయ్యాను.
 
పాన్ ఇండియా సినిమా క‌దా ఇండ‌స్ట్రీ స‌పోర్ ఎలా వుంది?
మా సినిమాకు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మ‌మ్ముట్టితోపాటు బాలీవుడ్‌లో అంద‌రూ స‌పోర్ట్ చేశారు. ఇది నాకు చాలా సంతోషంగా వుంది.
 
సీతారామం సినిమాను ఎందుకు చూడాలంటారు?
సీతారామం వంటి క‌థ‌లు రేర్‌గా వ‌స్తాయి. ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌కు అప్ప‌టి అనుబంధాలు, ఆప్యాయ‌త‌లు, అన్ని ఎమోష‌న్స్ క‌నిపిస్తాయి. ఇందులో కామెడీ కూడా వుంది. సుమంత్‌, త‌రుణ్ భాస్క‌ర్ వంటి న‌టుల న‌ట‌న‌, ర‌ష్మిక న‌ట‌న‌తోపాటు విశాల్ చంద్ర‌శేఖ్ సంగీతం సినిమాకు హైలైట్‌గా వుంటుంది. యుద్ధం, మిస్ట‌రీ అన్నీ అంశాలు ఇందులో వున్నాయి. ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమా.
 
సీత‌గా ట్రెడిష‌న్ దుస్తుల్లో ఎలా అనిపిస్తుంది?
ఇంత‌కుముందు నేను మోడ్ర‌న్ దుస్తులు వేసి చేశాను. తొలిసారిగా ఇండియ‌న్ ట్రెడిష‌న్ లో న‌న్ను నేను చూసుకోవ‌డం ఆనందంగా వుంది. సీత‌గా అంద‌రూ ఓన్ చేసుకుంటున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్ చూశాక తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళంలోనూ అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఇందుకు అశ్వినీద‌త్‌, స్వ‌ప్న‌గారికి నేను రుణ‌ప‌డి వుంటాను.
 
తెలుగులో కొన‌సాగిస్తారా?
త‌ప్ప‌కుండా చేస్తాను. మంచి ఛాలెంజింగ్ పాత్ర‌లు రావాల‌ని కోరుకుంటున్నా. హిందీ, పంజాబీ, స్పానిష్, తెలుగు ఇలా అన్ని భాష‌ల్లో చేయాల‌నుంది. తెలుగులో క‌థ‌లు వింటున్నాను.
 
కొత్త  సినిమాలు?
`పీపా` అనే సినిమా బాలీవుడ్‌లో చేస్తున్నా. ఇండియా బంగ్లాదేశ్ వార్ చిత్రం. ఆదిత్య‌రాయ్ క‌పూర్‌తో ఓ సినిమా పూజామేరీ జాన్ అనే సినిమా చేశాను. 
 
సీతారామం లెట‌ర్ చుట్టూ తిరుగుతుంది గ‌దా. మీ లైఫ్ లెట‌ర్స్ వ‌చ్చాయా? అందులో స్వీట్ లెట‌ర్ వుందా?
నా స్నేహితుల‌నుంచి చాలా లెట‌ర్స్ అందుకున్నాను. అందులో రెండు ల‌వ్ టెల‌ర్స్ కూడా వున్నాయి. కానీ ఇప్పుడు నా ఫోక‌స్ అంతా సినిమాల‌వైపే. 
 
హిందీ జెర్సీ సినిమా చేశారు ఎలా అనిపించింది?
తెలుగులో నాని, శ్ర‌ద్ద‌, బాల‌న‌టుడు అంద‌రూ బాగా న‌టించారు. అందులో శ్ర‌ద్ధ పాత్ర‌ను నేను పోషించ‌డం చాలా గ‌ర్వంగా వుంది. ఇలాంటి పాత్ర‌లు చేయ‌డం వ‌ల్ల కొత్త ద‌నం అనిపిస్తుంది. న‌న్ను నేను నిరూపించుకోవ‌డానికి ప‌నికి వ‌స్తుంది.
 
సీతారామం షూట్ ర‌ష్యా, క‌శ్మీర్ ల‌లో  మైన‌స్ డిగ్రీలో చేశారుక‌దా ఎలా అనిపించింది?
ర‌ష్యా, క‌శ్మీర్‌, స్విట్జ‌ర్లాండ్‌లో మైన‌స్ డిగ్రీలో చేయాల్సివ‌చ్చింది. స్ట‌డీ కామ్ తో షూట్ చేస్తుండ‌గా దుల్క‌న్‌, ద‌ర్శ‌కుడుకూడా ప‌రుగెడుతూ చేశారు. నేనుకూడా చేశాను. అవ‌స‌ర‌మైతే ఇంకా చేస్తాన‌ని అని అడిగాను. ఒక ద‌శ‌లో డాన్స్‌లో ఓ ముద్ర చేయాల్సి వ‌చ్చింది. అంత చ‌లిలోనూ నేను చేయ‌గ‌లిగాను అంటే న‌టిగా చేయాలి కాబ‌ట్టి అందుకు నేను ప్రిపేర్ అయ్యాను.