గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2022 (22:48 IST)

మాల్దీవులకు ట్రిప్పేసిన గీత గోవిందం జంట.. అలా బుక్కయ్యారుగా...! (video)

గీత గోవిందం జంట రెండేళ్ల పాటు లవ్వాయణం నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో ఆజ్యం పోసినట్లు రష్మిక- విజయ్ దేవరకొండ అడ్డంగా దొరికిపోయారు. మాల్దీవులలో ఏకాంతంగా గడిపేందుకు వెళ్తూ విజయ్-రష్మిక జోడీ మీడియా కంటపడింది. 
 
ఎక్కువగా ముంబైలో ఉంటున్న వీరిద్దరూ అక్కడ జంటగా తిరుగుతున్నారు. డిన్నర్ నైట్స్‌కి వెళుతూ, షాపింగ్స్ చేస్తూ పలుమార్లు ఇద్దరూ కెమెరా కంటికి చిక్కారు. దీంతో బాలీవుడ్ మీడియా విజయ్-రష్మిక డేటింగ్ చేస్తున్నారంటూ కోడై కూసింది. ఈ వార్తలను విజయ్ దేవరకొండ ఖండించారు.
 
అలాగే రష్మిక మేమిద్దరం మంచి స్నేహితులమంటూ రిలేషన్‌ని సమర్థించుకుంది. తీరా చూస్తే.. ఇద్దరూ కలిసి మాల్దీవ్స్ వెకేషన్ కి చెక్కేస్తున్నారు. తాజాగా రష్మిక, విజయ్ దేవరకొండ ఎయిర్ పోర్ట్‌లో జంటగా ప్రయాణం చేస్తూ కనిపించారు. బాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం రష్మిక, విజయ్ మాల్దీవ్స్ వెకేషన్‌కి వెళుతున్నారట.  
 
గత రెండేళ్లుగా విజయ్ దేవరకొండకు సన్నిహితంగా ఉంటుంది. విజయ్‌కి జంటగా గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు చేసింది రష్మిక. ఈ చిత్రాల్లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.