గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 అక్టోబరు 2022 (10:55 IST)

ఆ కళ్లద్దాలు విజయ్ దేవరకొండవేనా? మాల్దీవుల్లో రష్మిక మందన్నా...

rashmikamandanna
పుష్ప చిత్రంతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన్నా.. ఇపుడు టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండతో ప్రేమలో పడినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఎంతోకాలంగా ఈ ప్రచారం సాగుతోంది. కానీ వారిద్దరూ ఎన్నడూ ఖండించలేదు. వీరిద్దరూ కలిసి గీతగోవిందం చిత్రంలో నటించారు. అపుడే వీరిమధ్య ప్రేమ చిగురించి కొనసాగుతున్నట్టు సమాచారం. అయితే, ఇపుడు వీరిద్దరూ కలిసి మాల్దీవులకు వెళ్లినట్టు సమాచారం. దీనికి మరింత బలం చేకూర్చేలా ముంబై ఎయిర్‌పోర్టులో వీరిద్దరూ కెమెరా కంటింకి చిక్కారు. దీంతో వీరిద్దరూ కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
ఇదిలావుంటే, కెరీర్‌లో ఫుల్‌ బిజీగా ఉన్న రష్మిక బ్యూటీ తాజాగా వర్క్‌ లైఫ్‌ నుంచి చిన్న బ్రేక్‌ తీసుకొని మాల్దీవుల్లో సముద్రం, ప్రకృతి అందాలను ఎంజాయ్‌ చేస్తోన్న ఆమె వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలను ఒక్కొక్కటిగా అభిమానులతో పంచుకుంటున్నారు.
 
ఇందులోభాగంగా తాజాగా ఆమె షేర్‌ చేసిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. తాను ఉంటోన్న హోటల్‌ రూమ్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద కూర్చొన్న ఆమె ‘ఫ్లోటింగ్‌ ఫుడ్‌’ని ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు.
rashmikamandanna
 
వెకేషన్‌లో ఇటువంటి ఫొటోలు దిగడం సర్వసాధారణమే కదా ఇందులో వైరల్‌గా మారేంత కంటెంట్‌ ఏముంది అనుకుంటున్నారా..? అది నిజమే కానీ, ఈ ఫొటోలో ఆమె ఓ బ్రాండ్‌ న్యూ కూలింగ్‌ గ్లాసెస్‌ ధరించారు. 
 
వీటిని గమనించిన విజయ్‌ దేవరకొండ అభిమానులు.. 'ఈ కళ్లజోడు విజయ్‌ దేవరకొండది. ఆయన కళ్లజోడునే ఆమె పెట్టుకున్నారు. అంటే వీళ్లిద్దరూ కలిసే మాల్దీవులకు వెళ్లారన్నమాట' అంటూ సోషల్‌మీడియా వేదికగా గుసగుసలాడుకుంటున్నారు.
 
మరికొంతమంది అభిమానులు.. 'మేడమ్‌.. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోని షేర్‌ చేయండి' అని కోరుతున్నారు. శుక్రవారం ఉదయం విజయ్‌ దేవరకొండ, రష్మిక ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి మాల్దీవులకు టూర్‌ వెళ్తున్నారంటూ వెబ్‌సైట్లలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో రష్మిక షేర్‌ చేసిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారి, అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.