సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2022 (21:39 IST)

కత్రినా కైఫ్ సోదరుడి ప్రేమలో పోకిరి భామ.. సహజీవనం కూడా..?

Ileana D'Cruz
Ileana D'Cruz
నడుము సుందరి.. పోకిరి భామ ఇలియానా ప్రస్తుతం ప్రేమలో వుంది. ఇంకా అతనితో కలిసి సహజీవనం చేస్తోందనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా కొనసాగిన ఇలియానా.. తమిళంలోనూ నటించింది. దక్షిణాదిలో కెరీర్ పీక్‌లో ఉండగానే ఆమె బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. ఆ తర్వాత ఆమెకు దక్షిణాదిలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. 
 
బాలీవుడ్‌లో కూడా ఊహించినంతగా అవకాశాలు రాలేదు. ఇదే సమయంలో ఆండ్రూ నీబోన్ అనే ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్‌తో ఆమె ప్రేమలో పడింది. కొంత కాలంపాటు వీరి ప్రేమాయణం నడిచింది. ఆ తర్వాత విడిపోయారు. ఆపై సినిమాల్లో సక్సెస్ కాలేకపోయింది. 
 
మరోవైపు ఇప్పుడు ఆమె మరోసారి ప్రేమలో పడిందని బీటౌన్ టాక్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్‌తో ఆమె రిలేషన్ షిప్‌లో ఉందనే ప్రచారం జరుగుతోంది. 
 
ఇటీవల కత్రినా కైఫ్ పుట్టినరోజు వేడుకలు మాల్దీవుల్లో జరిగాయి. ఈ వేడుకలకు కత్రినా భర్త విక్కీ కౌశల్‌తో పాటు సెబాస్టియన్, ఇలియానా కూడా హాజరయ్యారట. ఫోటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేగాకుండా వీరిద్దరూ ముంబైలోని ఓ ఫ్లాటులో సహజీవనం చేస్తున్నారని టాక్ వస్తోంది.