గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (20:13 IST)

అమ్మ ఉసురు త‌గిలిందన్న అన‌సూయ మాట‌లు ఆ హీరో గురించేనా!

Anasuya'
Anasuya'
ఎప్పుడూ ఏదో ర‌కంగా సోష‌ల్‌మీడియాలో వుండే అన‌సూయ ప్ర‌ముఖుల పుట్టిన‌రోజులు, త‌న పుట్టిన‌రోజులు, అందం గురించి టిప్స్ చెబుతుండేది. కానీ ఈరోజు అమ్మ గురించి క‌ర్మ సిద్దాంతం పోస్ట్ చేసింది. మైండ్‌లో ఎవ‌రినో ఉద్దేశించి పెట్టిన ఆ మాట‌లకు నెటిజ‌న్లు ఘాటుగానే స్పందిస్తున్నారు. ఆమె పెట్టిన సారాంశం ఏమంటే.. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా.. అంటూ పోస్ట్ చేసింది.
 
ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే.. అర్జున్ రెడ్డి చిత్ర విజ‌య‌ప‌థంలో వుండ‌గా ఓ ఫంక్ష‌న్ ఏర్పాటుచేసింది చిత్ర‌యూనిట్‌. ఆ స‌మ‌యంలో జ‌నాల‌ను చూసి ఆవేశంతోనో ఆనందంతోనే అక్క‌డి యూత్ చేత `మాకీ..` అంటూ ఓ డైలాగ్ సంబోధించాడు. వారిచేత‌కూడా అనిపించాడు. ఇది ఎప్పుడో 5ఏళ్ళ‌నాడు జ‌రిగిన ముచ్చ‌ట‌. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను టార్గెట్ చేసింద‌ని నెటిజ‌న్లు భావిస్తున్నారు. 
 
ఈ రోజు విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన సినిమా లైగ‌ర్ విడుద‌లైంది. డివైడ్ టాక్ నెల‌కొంది. దాంతో అన‌సూయ కూడా ఈ పోస్ట్ పెట్ట‌డంతో నెటిజ‌న్లు విజ‌య్ గురించే పెట్టిన‌ట్లు తెగ తిడుతున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్‌లో నువ్వు చూపించిన అందాలు, వాడిన బాష నీకు గుర్తులేదా? అంటూ కొంద‌రంటే, నీతులు చెప్ప‌డానికి నీకు అర్హ‌త‌లేదంటూ మ‌రింత ఘాటుగానే స్పందించారు. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. మ‌రి దీనికి సంబంధించిన వివ‌ర‌ణ అన‌సూయ ఎప్పుడు ఇస్తుందో చూడాలి. అస‌లు విజ‌య్‌తో అన‌సూయ‌కు ఎక్క‌డ చెడిందో త్వ‌ర‌లో తెలియ‌నుంది. వెయిట్ అండ్ సీ..