గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2022 (14:29 IST)

లైగ‌ర్ నెటిజ‌న్ల‌కు అన‌సూయ చివరి హెచ్చరిక

Anasuya
Anasuya
గురువారంనాడు యాంక‌ర్‌, న‌టి అన‌సూయ సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌కు నెటిజ‌న్లు తీవ్రంగా స్పందించారు. క‌ర్మ సిద్దాంతం గురించి చెబుతూ, అమ్మ‌ను తిట్టిన ఉసురు ఊరికేపోదుగా! అంటూ తెలియ‌జేసింది. ఇది లైగ‌ర్ సినిమాలో న‌టించిన విజ‌య్‌దేవ‌ర‌కొండ గురించే అన్న విష‌యాన్ని నెటిజ‌న్లు, చ‌దివిన వారు అర్థం చేసుకున్నారు. అందుకు కార‌ణం అర్జున్ రెడ్డిలో అమ్మ‌ను తిట్టే డైలాగ్స్ వున్నాయి. అవి అప్పుడు పెద్ద ర‌చ్చ‌గా మారింది. కానీ ఇప్పుడు ఇన్నేళ్ళ త‌ర్వాత అన‌సూయ దురుద్దేశ్యంతో ఇలా కామెంట్లు పెట్టింద‌ని నెటిజ‌న్లు ఫైర్ అయ్యారు. ఆమెపైనే కాకుండా ఆమె ఫ్యామిలీపైనే దాడి చేశారు. 
 
వాట‌న్నింటికీ శుక్ర‌వారంనాడు అదే సోష‌ల్ మీడియాలో అన‌సూయ సీరియ‌స్ అండ్ ఫైన‌ల్ వార్నింగ్ అంటూ అంద‌రినీ హెచ్చ‌రించింది. ఇదిగో..నన్ను దుర్భాషలాడిన ప్రతి అకౌంట్ స్క్రీన్‌షాట్ తీయడం..ఆంటీ అని పిలవడం ద్వారా వయసును అవమానించడం..ఇందులో నా కుటుంబాన్ని ప్రమేయం చేయడంతో నేను కేసు ఫైల్ చేసి, ఎలాంటి చట్టబద్ధత లేకుండా నా వద్దకు వచ్చినందుకు చింతించే స్థాయికి తీసుకెళ్తాను. కారణం..ఇది నా చివరి హెచ్చరిక..