శనివారం, 9 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2022 (10:35 IST)

ఆమె తొడిగిన ఉంగరం.. అప్పటి వరకు తీయను.. విజయ్ దేవరకొండ (వీడియో వైరల్)

Vijaydevarakonda
Vijaydevarakonda
విజయ్ దేవరకొండకు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. లైగర్ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా విజయ్ ఎక్కడికి వెళ్లినా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. చిత్రం లైగర్ ప్రమోషన్స్ కోసం బెంగళూరు వెళ్లగా, ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. తేజు అనే అమ్మాయి తన ఆరాధ్య హీరోను ఎదురుగాచూసి సంతోషంలో ఎగిరి గంతేసింది. 
 
అంతేకాదు, దిష్టి తగలకుండా అప్పటికప్పుడు ఓ ఉంగరం తొడిగి తన ప్రేమను వెల్లడించింది. ఆమె ప్రపోజ్ చేసిన తీరు పట్ల విజయ్ హర్షం వ్యక్తం చేశాడు. అంతేగాకుండా భావోద్వేగానికి గురైన ఆమెను దగ్గరికి తీసుకుని ఓదార్చాడు. అంతేకాదు, లైగర్ ప్రమోషన్లు పూర్తయ్యేదాకా ఆమె తన వేలికి తొడిగిన రింగ్‌ను తీయనని మాటిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
 
లైగర్ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గానూ, రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపిస్తోంది. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by T H E J U ✨