లైగర్ ఫస్డ్ డే కలెక్షన్‌తో సంతృప్తి చెందిన పూరీ !
Liger First Day Collection
మొత్తంగా విజయ్ కెరీర్‌లోనే బెస్ట్ వసూళ్లనే అందుకున్నట్టు తెలుస్తుంది. మరి మిగిలిన చోట్ల ఎలా వుంది. ఓవర్ సీన్‌లోనూ, బాలీవుడ్‌లోనూ తేడా లేకుండా అన్ని చోట్లా ఈ సినిమాపై నెగెటివ్ టాక్ వచ్చేసింది. అయినా వరల్డ్ వైజ్‌గా మొదటి రోజు 13.12 కోట్ల గ్రాస్‌గా నిలిచిందని చిత్ర యూనిట్ తెలియజేస్తుంది. వచ్చే వారం వరకు పెద్ద సినిమా ఏదీ విడుదల లేకపోవడంతో లైగర్‌కు ప్లస్ పాయింట్ అవుతుందని కొందరు తెలియజేస్తున్నారు.
ఏది ఏమైనా సినిమాను సరిగ్గా దర్శకుడు పూరీ జగన్నాథ్ తీయలేదని, కథలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం మొదటిరోజు కలెక్షన్లవరకే ఈ సినిమా పరిమితం అవుతుందా? లాంగ్‌రన్‌లో నిలుస్తుందా అనేది ట్రేడ్‌వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. సోలో సినిమాగా వచ్చిన లైగర్ యాక్షన్ కోసమే చూసేవారికి నచ్చుతుందని విశ్లేషిస్తున్నాయి. మరి ఈ సినిమా పబ్లిసిటీ జిమ్మిక్క్ ఒక్కరోజుకే పరిమితం అవుతుందేమోనని పలువురు అంచనావేస్తున్నారు.
