గురువారం, 9 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 సెప్టెంబరు 2025 (17:48 IST)

ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. తృటిలో తప్పిన ప్రమాదం

indigo flight
లక్నో నుంచి ఢిల్లీ వెళుతున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విమానం టేకాఫ్ అవుతుండగా ఈ సమస్య ఏర్పడింది. దీంతో వెంటనే స్పందించిన పైలెట్ చివరి నిమిషంలో టేకాఫ్‌ను నిలిపివేసి, విమానాన్ని సురక్షితంగా రన్‌వే పైకి తీసుకొచ్చారు. ఆ సమయంలో విమానంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ సహా 151 మంది ప్రయాణికులు ఉన్నట్టు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. అనంతరం ప్రయామణికులను వేరే విమానంలో ఢిల్లీ తరలించడానికి ఏర్పాటు చేశారు. 
 
ఇటీవల ఇలాగే తిరువనంతపురం ఢిల్లీ నుంచి ఢిల్లీకి వెళుతున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసర పరిస్థితుల్లో చెన్నై విమానాశ్రయంలో దిగింది. ఆ సమయంలో విమానంలోని 150 మంది ప్రయాణికుల్లో పార్లమెంట్ సభ్యులు కేసీ వేణుగోపాల్, కొడికున్నిల్  సురేష్, ఆదూర్ ప్రకాశ్, కె.రాధాకృష్ణన్ తదితర ప్రముఖులు ఉన్నట్టు తెలిపారు.