శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 11 అక్టోబరు 2022 (23:14 IST)

ఐఐటీ మద్రాస్ ప్రవర్తక్ ఫౌండేషన్, విద్యార్థులు బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో కెరీర్, నైపుణ్యాల కోర్స్‌లు

RBI
చెన్నైలో ప్రీమియర్ ఫైనాన్స్ సెక్టర్ సర్టిఫైడ్ ట్రైనర్ ఇన్‌ఫాక్ట్‌ప్రోతో, ఐఐటీ మద్రాస్ వారి చొరవ డిజిటల్ స్కిల్స్ అకాడమీ సహకారంతో కోర్సులు అందించబడుతున్నాయి. ఇన్‌ఫాక్ట్‌ప్రో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, స్కిల్స్ డెవెలప్‌మెంట్ మంత్రిత్వ శాఖ యొక్క ఇన్స్యూరెన్స్ సెక్టర్ స్కిల్ కౌన్సిల్ యొక్క శిక్షణా భాగస్వామి.
 
బ్యాంకింగ్‌లో కెరీర్ రూపొందించడానికి భారతదేశంలో విద్యార్థులలో ఎంతో ఆసక్తి ఉంది. దాదాపు 30 లక్షల మంది ఆశావహులు ఏటా వివిధ బ్యాంక్ నియామక పరీక్షలు రాస్తున్నారు, వారిలో కేవలం 0.5 శాతం మాత్రమే పరీక్షలో ఉత్తీర్ణమవుతున్నారు. ఈ విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగు పరచుకోవడానికి సిద్ధంగా ఉంటే ఫైనాన్స్ మరియు బ్యాంకింగ్ రంగాలలో వారి కోసం భారీ అవకాశాలు ఉన్నాయి.
 
టియర్ 2 మరియు టియర్ 3 పట్టణాలలో బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ కోసం డిమాండ్ పెరుగుతుండటంతో సహజాంగానే ఈ పట్టణాలలో శిక్షణా ప్రొఫెషనల్స్ కోసం డిమాండ్ పెరుగుతోంది. ఇంకా కోర్సులో పేరు నమోదు చేసుకోవడం మరియు పాఠ్యాంశాలు గురించి వివరాలను ఈ క్రింది వెబ్‌సైట్స్ iit.infactpro.com  లేదా skillsacademy.iitm.ac.in నుండి పొందవచ్చు.