1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2022 (11:32 IST)

ఆర్జీయూకేటీలో ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్.. ఫీజులు ఎంతంటే?

rgukt iit nuzvid
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం ఆఫ్ లాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీ సీట్ల భర్తీని చేపట్టనున్నారు. ఈ ట్రిపుల్ ఐటీ పరిధిలోనూ నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెండేళ్ల పీయూసీ, నాలుగేళ్ల బీటెక్ కోర్సుతో కలిసి మొత్తం ఆరేళ్ల కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు. 
 
ఇందుకోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబరు 12-13 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయల్లోనూ, 14, 15 తేదీల్లో ఒంగోలు క్యాంపస్‌కు సంబంధించి ఇడుపులపాయ, 15, 16 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్ ఎచ్చెర్లలో జరుగుతుంది. పదో తరగితిలో ఉత్తీర్ణత సాధించిన ఎస్ఎస్ఈ బోర్డు జారీ చేసిన మార్కుల షీటు, కుల ధృవీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్, విద్యార్థికి సంబంధించిన లేటెస్ట్ పాస్‌పోర్టుతో అర్హులైన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.
 
ఈ కోర్సుల్లో చేరే విద్యార్థులకు జగనన్న విద్య, వసతి దీవెన పథకాలకు అర్హతలేని విద్యార్థులు పీయూసీలో ప్రవేశం పొందితే యేడాదికి రూ.45 వేలు ఫీజు, ఇంజనీరింగ్‌లో చేరితో యేడాదికి రూ.50 వేలు చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 
 
మెస్ చార్జీల కోసం నెలకు రూ.2500 నుంచి రూ.3 వేల వరకు ఉంటుంది. అడ్మిషన్ ఫీజుగా రూ.1000, ఎస్టీ, ఎస్టీ విద్యార్థులకు రూ.500, గ్రూపు బీమా కింద రూ.1200, కాషన్ డిపాజిట్ కింద రూ.1000, అకామడేషన్ మేనేజ్‌మెంట్ కింద రూ.1000 చొప్పున ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.