సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (11:58 IST)

తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త.. ఏంటది?

jobs
తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త. 833 ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఓ ప్రకటనలో పేర్కొంది. మొత్తం 833 పోస్టుల్లో 434 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, 399 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. వీటి భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 
 
ఈ పోస్టులన్నీ పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్, ట్రైబల్ వెల్ఫేర్, ఇరిగేషన్ తదితర విభాగాల్లో ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విద్యార్హతలు స్పెషలైజేషన్ ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ, బీటెక్, స్పెషలైజేషన్ బ్యాచిలర్ డిగ్రీని కలిగివుండాలి. 
 
అలాగే, అభ్యర్థుల వయస్సు తప్పనిసరిగా 18 నుంచి 44 యేళ్ల మధ్య ఉండాలి. వచ్చే నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ నెల 28వ  తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. ఈ పోస్టులను రాతపరిక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 
 
పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థుల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకైతే నెలకు రూ.45960 నుంచి  రూ.12415 వరకు వేతనం చెల్లిస్తారు. అలాగే, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు రూ.13810 నుంచి రూ.96890 వరకు చెల్లిస్తారు. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో తనిఖీ చేసుకోవచ్చు.