శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (15:26 IST)

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మొత్తం 40 పోస్టులు..

Jobs
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ స్టేట్ కో-ఆపరేటీవ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రాష్ట్రంలో మొత్తం 40 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్టాఫ్ అసిస్టెంట్, మేనేజర్ స్కేల్ 1 పోస్టులను భర్తీ చేయనున్నారు. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో ఉంటుంది. నోటిఫికేషన్‌, అప్లికేషన్ ప్రాసెస్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://tscab.org/apex-bank/ను సందర్శించాల్సి ఉంటుంది.
 
ఎంపిక విధానం..
* దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు.
* ఉత్తీర్ణులైన వారికి మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.
* తరువాత మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.