గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2022 (15:14 IST)

డెహ్రాడూన్‌ ఓఎన్జీసీలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Jobs
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో వున్న ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ఓఎన్జీసీ) ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌, పెట్రోలియం ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌ తదితర విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
 
పోస్టును బట్టి అభ్యర్ధుల వయసు 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 30, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
ఇంజనీరింగ్‌, జియో సైన్సెస్‌ విభాగాలో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను గేట్ 2023 సాధించిన ర్యాంకుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.60,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.