1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. Notification release for MBBS, BDS Convenor Quota Seats,

కన్వీనర్ కోటాలో వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ

medical staff
తెలంగాణ రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది. మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఈ నోటిఫికేషన్ ద్వారా యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2022లో అర్హత సాధించిన అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అక్టోబరు 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతోపాటు అభ్యర్థులు సంబంధిత ధృవీకరణ పత్రాలను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుదని, ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, ధృవపత్రాలను యూనివర్శిటీ అధికారులు పరిశీలించిన తర్వాత తుది మెరిట్ ఫలితాలను వెల్లడిస్తారు. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారానికి యూనివర్శిటీ వెబ్‌సైట్‌ www.knruhs.telangana.gov.in లో చూడాలని యూనవర్శిటీ వర్గాలు పేర్కొన్నాయి. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఆర్జీయూకేటీలో ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్.. ఫీజులు ఎంతంటే?