1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. LIC Golden Jubilee Scholarship 2022

ఎల్ఐసీ బంపర్ ఆఫర్: విద్యార్థులకు స్కాలర్ షిప్స్..

life insurence policy
అర్హులైన విద్యార్థులకు దేశంలోనే అతిపెద్ద బీమా రంగ సంస్థ ఎల్ఐసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అర్హులైన వారికి స్కాలర్షిప్ అందించనుంది. దరఖాస్తుల స్వీకరణ 30-09-2022తో ముగియనుంది.  
 
ఎల్‌ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ అందిస్తోన్న ఈ స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు గుర్తింపు పొందిన కళాశాల-యూనివర్సిటీలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను గ్రాడ్యుయేషన్ మొదటి ఏడాది ప్రవేశం పొంది ఉండాలి. 
 
అలాగే విద్యార్థులు 12వ తరగతి బోర్డు ఎగ్జామ్స్‌లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. 
విద్యార్థుల పేరెంట్స్‌ వార్షిక ఆదాయం రూ. 3,60,000 లోపు ఉండాలి.  ఈ స్కాలర్షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ. 15,000 చొప్పున మూడేళ్లు ఆర్థిక సహాయం అందిస్తారు.
 
విద్యార్థులు కచ్చితంగా ఫొటో ఐడెంటిటీ ప్రూఫ్, విద్యార్హత మార్క్స్ షీట్, ఆదాయ ధృవీకరణ పత్రం, ప్రస్తుతం ప్రవేశం పొందిన కాలేజ్ ఐడి లేదా బోనఫైడ్ సర్టిఫికెట్, ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజు రిసిప్ట్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, క్యాస్ట్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
Black water: Shruti Haasan, Kajal Aggarwal, Malaika Arora వంటి చాలామంది అందగత్తెలు తాగే ఈ నీటి ప్రత్యేకత ఏమిటి?