మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 21 నవంబరు 2022 (09:16 IST)

భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్లు.. కాల్పులు జరిపిన బీఎస్ఎఫ్

drone
భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. పంజాబ్‌ సరిహద్దుల్లో ఇవి కనిపించాయి. దీంతో అప్రమత్తమైన భారత సరిహద్దు గస్తీ దళం (బీఎస్ఎఫ్) కాల్పులు జరిపాయి. ఓ డ్రోన్‌ను లక్ష్యంగా చేసుకుని 96 రౌండ్ల కాల్పులు జరిపినట్టు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు వెల్లడించారు. దీంతో తోకముడిచిన పాక్ డ్రోన్లు తిరిగి తమ భూభాగంలోకి వెళ్లిపోయారు. 
 
కొద్దిసేపు కలకలం రేపిన ఈ రెండు డ్రోన్లలో తొలి డ్రోన్ పంజాబ్ సరిహద్దు ప్రాంతమైన గురుదాస్ పూర్ జిల్లా కాసోవాల్ ప్రాంతంలో కనిపించింది. ఆ వెంటనే అప్రమత్తమైన బీఎస్ఎఫ్ బలగాలు దానిపై కాల్పులు ప్రారంభించడంతో వెళ్లిపోయాయి. 
 
ఆ డ్రోన్ లక్ష్యంగా చేసుకుని ఏకంగా 96 రౌండ్ల కాల్పులు జరిపింది. 5 ఇల్యుమినేషన్ బాంబులను కూడా ప్రయోగించారు. ఆ తర్వాత డ్రోన్ కనిపించిన ప్రాంతంలో నిశితంగా తనిఖీ చేశారు. 
 
అదేవేధంగా అమృత్‌సర్ జిల్లాలోని చన్నా పఠాన్ ప్రాంతంలో కూడా మరో డ్రోన్ కనిపించింది. బీఎస్ఎఫ్ దళాలు దానిపై 10 రౌండ్ల కాల్పులు జరపడంతో ఈ డ్రోన్ కూడా తమ భూభాగంలోకి వెళ్లిపోయింది.