శుక్రవారం, 1 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2022 (17:23 IST)

సానియా - షోయబ్ విడిపోయారంటూ ప్రచారం.. ఆయేషా ఫోటోలు వైరల్

ayesha - shoib
భారత్ టెన్నిస్ స్టారా సానియా మీర్జా, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌‍ల వైవాహిక బంధం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం పాకిస్థాన్‌కు చెందిన నటి ఆయేషా ఒమర్ కారణమనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై సానియా లేదా షోయబ్ మాలిక్‌లు ఇప్పటివరకు స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో షోయబ్ మాలిక్‌తో గాయని ఆయేషా ఒమర్ ఉన్న ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ayesha - shoib
 
పలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఈ అమ్మడి ఫోటోలే కనిపిస్తున్నాయి. పైగా, ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆమె ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో షోయబ్ మాలిక్, ఆయేషా ఒమర్‌లు కలిసి ఓ మ్యాగజైన్ కోసం నిర్వహించిన ఫోటో షూట్ ఫోటోలు ఇపుడు వైరల్ అయ్యాయి. ఆయేషా క్రికెట్ వీరాభిమాని కావడంతో పాకిస్థాన్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌కు ఆమె హాజరవుతూ ఆటగాళ్లను ప్రోత్సహిస్తుంటారు.