ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2022 (15:42 IST)

కృష్ణ సరసన నటించే ప్రతి హీరోయిన్ ఎంతో సౌకర్యంగా ఫీలయ్యేవాళ్లు.. నటి రాధ

radha
హీరో కృష్ణగారి సరసన నటించిన ప్రతి ఒక్క హీరోయిన్ ఎంతో సౌకర్యంగా ఫీలయ్యేవాళ్లమని ఆయనతో కలిసి నటించిన సీనియర్ నటి రాధ చెప్పారు. కృష్ణ మృతిపై రాధ స్పందిస్తూ, కృష్ణ ఒక లెజండరీ నటుడు అని చెప్పారు. ఆయన ఇక లేరన్న వార్త తెలిసి గుండె పగిలినంత పని అయిందన్నారు. ఆయన సరసన నటించడాన్ని గర్వంగా భావిస్తానని చెప్పారు. తామిద్దరం కలిసి అనేక చిత్రాల్లో నటించామని, అప్పట్లో తమది హిట్ కాంబినేషన్ అని రాధ గుర్తుచేశారు. 
 
తమ కాంబినేషన్‌ను ప్రతి ఒక్కరా ఆస్వాదించేవాళ్లని ఆమె వివరించారు. కృష్ణగారి పక్కన నటించే ప్రతి హీరోయిన్ ఎంతో సౌకర్యంగా ఫీలయ్యేవాళ్లమని తెలిపారు. తెరపైనే కాదు.. వెలుపల కూడా ఎంతో ఉన్నతమైన వ్యక్తి అని రాధ కొనియాడారు. ఈ విషాద సమయంలో మహేశ్, ఇతర కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపనం తెలియజేస్తున్నట్టు రాధ తెలిపారు. కాగా, కృష్ణ - రాధ కాంబినేషన్‌లో దాదాపు 23 చిత్రాలు వచ్చాయి.