బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2022 (16:33 IST)

సంక్రాంతి మొనగాడు కృష్ణ : విరామం లేకుండా 21 యేళ్లపాటు సినిమాలు రిలీజ్

krishna
హీరో కృష్ణను తెలుగు చిత్రపరిశ్రమలో సంక్రాంతి మొనగాడుగా కూడా పిలుస్తారు. దీనికి కారణం ఆయన నటించిన చిత్రాలు క్రమం తప్పకుండా సంక్రాంతి పండుగకు విడదలయ్యేవి. అలా 21 యేళ్లపాటు ఒక్క సంవత్సరం కూడా విరామం లేకుండా సంక్రాంతికి విడుదలవుతూ వచ్చాయి. 
 
దివంగత మహానటుడు ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో 33 సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. ఆ తర్వాత మరో దివంగత నటుడు అక్కినేని నాగేశ్వర రావు నటించిన 31 సినిమాలు సంక్రాంతి బరిలోకి వచ్చాయి. ఇక హీరో కృష్ణ నటించిన 21 చిత్రాలు విరామం లేకుండా విడుదలయ్యాయి. 
 
అయితే, 21 యేళ్ల పాటు వరుసగా ప్రతి సంక్రాంతికి కొత్త సినిమా థియేటర్లలో ఉంటూ వచ్చింది. అందువల్లే ఆ అరుదైన రికార్డు కృష్ణ ఖాతాలో చేరిపోయింది. ఈ కారణంగానే కృష్ణను తెలుగు చిత్రపరిశ్రమలోని ప్రతి ఒక్కరూ సంక్రాంతి మొనగాడుగా పిలిచేవారు. 
 
పైగా, ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, కృష్ణంరాజులతో పోటీపడుతూ తన చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలిచేలా ప్లాన్ చేసుకునేవారు. ఇందుకోసం ఆయన గ్రామీణ నేపథ్యంలోని కథలను ఎక్కువగా ఇష్టపడేవారు. పల్లెటూరు బుల్లోడుగా ముల్లుగర్ర చేతబట్టి, పొలంగట్లపై ఫైట్లు, పాటలు పాడేలా తనను వెండితెరపై చూసుకునేందుకు కృష్ణ అమితంగా ఇష్టపడేవారు.