మంగళవారం, 31 జనవరి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated: బుధవారం, 28 సెప్టెంబరు 2022 (14:21 IST)

ఇందిరాదేవికి నివాళులర్పించిన సినీ ప్రముఖులు - అంత్యక్రియలు ముగిశాయి

mahesh-trivikram
mahesh-trivikram
జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌కు ఘ‌ట్టమనేని ఇందిరా దేవి గారి అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియల్లో ఘట్టమనేని కృష్ణగారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. 

హీరో కృష్ణ గారి సతీమణి, మహేష్ బాబు మాతృమూర్తి శ్రీమతి ఘట్టమనేని ఇందిరా దేవి (ఇందిర‌మ్మ‌) మృతి చెందడం బాధారకరం. ఆమె మృతికి.. తెలుగు దర్శకుల సంఘం తరపున..  సంతాపం తెలుపుతూ.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని.. ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను అంటూ డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్ సంతాపం ప్ర‌క‌టించింది.
 
krishna-mahesh and others
krishna-mahesh and others
ఈరోజు తెల్ల‌వారుజామున 4గంట‌ల‌కు మృతిచెందిన ఇందిరా దేవి భౌతిక‌కాయాన్ని ఆమె స్వ‌గృహంలో సినీ ప్ర‌ముఖులు సంద‌ర్శించి నివాళుర్పించారు. కృష్ణ‌, మ‌హేష్‌బాబు కుటుంబీకుల‌ను వారు ఓదార్చారు.
 
sitara-namrata
sitara-namrata
సితార ఘట్టమనేని తన నాన‌మ్మ‌ ఇందిరాదేవి గారికి నివాళులు అర్పించారు. న‌మ్ర‌త శిరోద్క‌ర్ ఆమె ప‌క్క‌నే వుండి కుమార్తెను ఓదార్చారు. 
 
venkatesh-nivali
venkatesh-nivali
ముఖ్యంగా త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మ‌హేష్‌బాబు భుజంమీద చేయి వేసి ఓదార్చుతూ క‌నిపించారు. అది చూసిన వారికి హృద‌యాన్ని ట‌చ్ చేసిన‌ట్ల‌యింది.

nagarjuna-nivali
nagarjuna-nivali
హీరోలు వెంక‌టేష్‌, మోహ‌న్‌బాబు,  నాగార్జున‌, నిర్మాత అశ్వ‌నీద‌త్‌, నిర్మాత రాధాకృష్ణ‌, ద‌ర్శ‌కుడు బి.గోపాల్, కె. రాఘ‌వేంద్ర‌రావు త‌దిత‌రులు ఇందిరా దేవికి నివాళుల‌ర్పించారు.
 
mohanbabu-nivali
mohanbabu-nivali
మహేశ్ బాబు కుటుంబంలో రెండు విషాదాలు
 
ashwanidath-nivali
ashwanidath-nivali
సూపర్ స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. కొద్దిరోజులుగా ఆరోగ్యం క్షీణించడంతో AIG ఆసుపత్రిలో చేర్చించారు. ఈక్రమంలోనే తెల్లవారుజామున 4 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు.

thaman-nivali
thaman-nivali
కాగా ఈఏడాది జనవరిలోనే మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఒకే ఏడాదిలో సూపర్ స్టార్ ఇంట్లో రెండు తీవ్ర విషాదాలు చోటుచేసుకున్నాయి.
 
సూపర్ స్టార్ కృష్ణకు ఇందిరా దేవి మొదటి భార్య కాగా.. వీరికి మహేష్, రమేష్, మంజుల, ప్రియుదర్శిని, పద్మావతి జన్మించారు. కాగా కృష్ణ రెండో భార్య విజయ నిర్మల 2019 లో చనిపోయిన సంగతి తెలిసిందే.