కృష్ణ గారికి ప్రభాస్ చివరి నివాళులు అర్పించారు
కృష్ణ గారికి ప్రభాస్ చివరి నివాళులు అర్పించారు తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఎన్నెన్నో వండర్స్ ను పరిచయం చేసినటువంటి స్టార్ సీనియర్ స్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు స్వర్గస్థులు అయ్యారు. దీనితో తెలుగు సినిమా దగ్గర ఒక మహా శకం ముగియగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉన్న ఎందరో ఇతర తారలు మహేష్ బాబు గృహానికి చేరుకొని కృష్ణ గారి పార్థివ దేహానికి అంజలి ఘటించి వారి ఆహ్మకి శాంతి చేకూరాలని కోరుకున్నారు.
కృష్ణ గారి ఇంటికీ వెళ్లి ప్రభాస్ శ్రదాన్జలి ఘటించారు. మహేష్ బాబాబు కొద్దిసేపు మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభాస్ వెంట యూ.వి. క్రియేషన్ నిర్మాతలు ఉన్నారు. మహేష్ ఇంటిలో మూడు విషాద ఘటనలు ఎదురు కావడం నిజంగా నన్ను చాలా బాధ కలిగించింది, కృష్ణ గారి ఆత్మ శాంతి కలగాలని మహేష్ గారికి నమ్రత గారికి వారి కుటుంబ సభ్యులకి ప్రఘాడ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని ప్రభాస్ తెలిపారు.