నేడు భారత్ - కివీస్ తొలి వన్డే - తుది జట్టులోకి ఉమ్రాన్ మాలిక్
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు శుక్రవారం ఆతిథ్య న్యూజిలాండ్ జట్టుతో తొలి వన్డే మ్యాచ్ ఆడుతుంది. ఇందుకోసం ప్రకటించిన తుది జట్టులోకి యువ ఆటగాడు ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకుంది. అక్లాండ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది.
ఇంతకుముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. పైగా, టీ20 భారత జట్టుకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహించాడు. ఇపుడు వన్డే టోర్నీకి శిఖర్ ధావన్ కెప్టెన్‌గా ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ వంటి యంగ్ క్రికెటర్లకు చోటుదక్కింది. ప్రస్తుతం భారత్ స్కోరు.. వికెట్ నష్టపోకుండా 9.3 ఓవర్లలో 39 పరుగులు చేసింది. ఇందులో కెప్టెన్ ధావన్ 20, శుభ్‌మన్ గిల్ 18 చొప్పున పరుగులు చేశారు.