శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2022 (18:03 IST)

వర్షం కారణంగా టైగా ముగిసిన మ్యాచ్ : సిరీస్ భారత్ వశం

team india
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌నున 1-0 తేడాతో కేవసం చేసుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో భారత్ 1-0 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది 
 
నేపియర్ వేదికగా మూడు టీ20 మ్యాచ్ మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు 19.4 ఓవర్లలో 160 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత బ్యాటింగ్‌కు దిగింది. కానీ, భారత్ బ్యాటింగ్‌లో వర్షం అడ్డుతగిలింది. 
 
161 లక్ష్య ఛేధనలో భారత్ 9 ఓవర్లలో 4 వికెట్లకు 75 పరుగులు చేసింది. ఆ దశలో భారీ వర్షం కురవడంతో మ్యాచ్ ఆగిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 66 బంతుల్లో 86 పరుగులు చేయాల్సిన తరుణంలో వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికే భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా (30 బ్యాటింగ్), దీపక్ హుడా (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 
 
ఓపెనర్లు ఇషాన్ కిషన్ 10, రిషబ్ పంత్ 11 చేసి ఔట్ అయ్యారు. శ్రేయాస్ అయ్యర్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు. మ్యాచ్ వర్షార్పణం కావడంతో రెండో వన్డేలో గెలిచిన భారత్‌కు సిరీస్ లభించింది.