126 రన్స్‌కే న్యూజిలాండ్ ఆలౌట్.. భారత్ ఘన విజయం
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు విజయం లభించింది. ఆతిథ్య దేశం కివీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తలపడుతుంది. అయితే, తొలి మ్యాచ్ ఒక్క బంతికూడా పడకుండా రద్దు అయింది. రెండో మ్యాచ్ ఆదివారం బే ఓవల్ మైదానం వేదికగా జరిగింది. ఇందులో భారత్ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ జట్టు 126 పరుగులకే ఆలౌట్ అయింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మెరుపులు మెరిపించాడు. కేవలం 49 బంతుల్లో సెంచరీ చేశాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మొత్తంగా 51 బంతుల్లో 11 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా బరిలోకి వచ్చిన ఓపెనర్లు ఇషాన్ కిషన్ 36, రిషబ్ పంత్ 6 చొప్పున మాత్రమే పరుగులు చేశారు. సూర్యకుమార్ 51 బంతుల్లో 11 ఫోర్లు, ఏడు సిక్స్‌ల సాయంతో 111 పరుగులు చేశాడు.
అలాగే, శ్రేయాస్ అయ్యర్ 13, హార్దిక్ పాండ్యా 13, దీపక్ హూడా, సుదర్‌లు డకౌట్ అయ్యారు. భువనేశ్వర్ కుమార్ (1), అదనంగా 11 పరుగులు వచ్చాయి. దీంతో న్యూజిలాండ్ జట్టు ముంగిట 192 రన్స్‌గా టార్గెట్‌గా ఉంచింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ జట్టు 126 పరుగులకే ఆలౌట్ అయింది.
కివీస్ ఓపెనర్లతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు పూర్తిగా విఫలమయ్యారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (61పరుగులు) మినహా మిగిలి ఓ ఒక్కరూ రాణించలేదు. దీంతో కివీస్ జట్టుకు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో దీపక్ హుడా నాలుగు వికెట్లు పడగొట్టగా, మహ్మద్ సిరాజ్, యజువేంద్ర చావల్‌లు రెండేసి వికెట్లు తీశారు. భువనేశ్వర్, వాషింగ్టన్ సుందర్‌లకు ఒక్కో వికెట్ తీశారు.