గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 21 నవంబరు 2022 (08:24 IST)

మెగాస్టార్‌కు ప్రతిష్టాత్మక అవార్డు .. ఏంటది?

chiranjeevi
మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు కోసం ఆయన్ను ఎంపిక చేశారు. దీన్ని కేంద్రం ప్రకటించింది. సోమవారం నుంచి గోవా వేదికగా జరిగే ఇఫీ (ఐఎఫ్ఎఫ్ఐ) చలనచిత్రోత్సవ వేడుకల్లో ఈ అవార్డును చిరంజీవికి ప్రదానం చేస్తారు. ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డుకు తనను ఎంపిక చేయడంపై చిరంజీవి స్పందించారు. 
 
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ చేసిన ప్రకటన తనకెంతో సంతోషం కలిగించిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని చిరంజీవి అన్నారు. 
 
అంతకుముందు చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022గా ప్రకటిస్తూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ అధికారికంగా ఓ ట్వీట్ చేశారు. తెలుగు సినిమా రంగంలో చిరంజీవి విశేష ప్రజాదారణ పొందారని, హృదయాలను కలిగించే నటనా ప్రతిభ ఆయన సొంతమని కొనియాడుతూ, మెగాస్టార్‌కు ఆయన అభినందనలు తెలిపారు.