శుక్రవారం, 1 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 20 నవంబరు 2022 (17:23 IST)

చైనాలో ఆరు నెలల తర్వాత కోవిడ్ మృతి నమోదు

covid vaccine
కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా ఉన్న చైనాలో ఆరు నెలల తర్వాత కోవిడ్ మరణం నమోదైంది. ఈ దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదవుతున్న విషయం తెల్సిందే. దీంతో చైనాలోని పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధిస్తూ, లాక్డౌన్‌ విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చైనాలో దాదాపు ఆరు నెలల తర్వాత మళ్లీ ఓ కోవిడ్ మరణం నమోదైంది. ఈ విషయాన్ని చైనా అధికారి ప్రకటనలో చెప్పారు. 
 
అలాగే, చైనా రాజధాని బీజింగ్‌కు చెందిన 87 యేళ్ల వృద్ధుడు కరోనా వైరస్ బారినపడి చనిపోయినట్టు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. మే 26వ తర్వాత చైనాలో కరోనా వైరస్ మరణం నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ తాజా మరణంతో చైనాలో కరోనా వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 5,227కి చేరింది. 
 
మరోవైపు, చైనాలో ప్రజలకు వ్యాక్సినేషన్ వేసినప్పటికీ కొత్త కేసులు నమోదవుతూనే ఉండటం గమనార్హం. ఈ దేశంలో ప్రస్తుతం 92 శాతం మంది ప్రజలు సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను వేసుకున్నారు.