మంగళవారం, 31 జనవరి 2023
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated: గురువారం, 10 నవంబరు 2022 (22:51 IST)

ఈశాన్య రాష్ట్రాల మీదుగా చైనాకు రైలు మార్గం.. డ్రాగన్ కంట్రీ?

Railway
Railway
ఈశాన్య రాష్ట్రాల మీదుగా చైనా సరిహద్దు వరకు రైలు మార్గాన్ని నిర్మించాలని భారతీయ రైల్వే యోచిస్తున్నట్లు సమాచారం. అరుణాచల్ ప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాల్లో చైనా సరిహద్దు వరకు రైల్వే లైన్లను నిర్మించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. 
 
భారతీయ రైల్వే ఇప్పటికే పొరుగు దేశమైన భూటాన్ వరకు రైల్వే లైన్ల నిర్మాణంలో నిమగ్నమై ఉండగా, ఈశాన్య సరిహద్దులోని అరుణాచల్ ప్రదేశ్‌తో సహా కొన్ని ప్రాంతాల్లో కొత్త రైల్వే లైన్లను నిర్మించాలని సన్నాహాలు చేస్తోంది. 
 
చైనా సరిహద్దుకు ఆనుకుని ఉన్న బలుక్‌పాంగ్‌, దవాంగ్‌, సిలాపత్తర్‌ వరకు రైలు మార్గాన్ని నిర్మించబోతున్నారని, చైనా సరిహద్దు సమస్యను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ఈ మార్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. చైనా సరిహద్దు వరకు రైల్వే లైన్ నిర్మించాలన్న భారతీయ రైల్వే నిర్ణయంపై చైనా ఎలా స్పందిస్తుందో చూడాలి.