ఆదివారం, 3 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 24 నవంబరు 2022 (07:33 IST)

కలాం ద్వీపం నుంచి అగ్ని-3 క్షిపణి ప్రయోగం సక్సెస్

agni 3 missile
ఒరిస్సా సముద్రతీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి చేపట్టిన అగ్ని-3క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఈ మధ్యంతర క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టినట్టు భారత రక్షణ పరిశోధనా సంస్థ డీఆర్డీవో వెల్లడించింది. 
 
సాధారణంగా సైనిక శిక్షణ ప్రయోగాల్లో భాగంగా ఈ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మధ్యంతర అగ్ని-3 పరీక్ష విజయవంతంగా ముగిసినట్టు డీఆర్డీవో వర్గాలు వెల్లడించాయి. ముందుగా నిర్ధేశించిన లక్ష్యాలను ఈ క్షిపణి చేరుకున్నట్టు అధికారులు వెల్లడించారు. 
 
కాగా, ఈ అగ్ని-3 క్షిపణి శ్రేణిలో గతంలో 2006 జూన్ 9వ తేదీన మొదటిసారిగా ప్రయోగించారు. ఈ క్షిపణఇ అణు వార్‌హెడ్‌ తీసుకెళ్లి 3500 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలదు. రెండో క్షిపణిని 2007లో విజయవంతంగా ప్రయోగించారు. 2008లో వరుసగా మూడోసారి ప్రయోగించారు. ఇపుడు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్షిపణిని ప్రయోగించగా అది పూర్తిగా విజయవంతమైంది.