గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2022 (13:15 IST)

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ గాంధీ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వాటర్ ఫిల్టర్ దుకాణంలో అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. 
 
జబ్బార్ కాంప్లెక్స్ సమీపంలోని అసెంబుల్ వాటర్ ఫిల్టర్ దుకాణంలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. క్షణాల్లో మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం ఏర్పడి వుండవచ్చునని తెలుస్తోంది.
 
సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.