బుధవారం, 16 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

మొత్తం మార్కులు 2 వేలు... వేసిన మార్కులు 5,360

vikrama simhapuri university
నెల్లూరు జిల్లా కేంద్రంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఈ దశాబ్దపు వింత చోటుచేసుకుంది. మొత్తం మార్కులు 800 అయితే, జవాబు పత్రాల మూల్యాంకన తర్వాత వేసిన మార్కులు 5360. ఈ మార్కులను చూసిన సదరు విద్యార్థికి కళ్లు బైర్లు కమ్మాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఈ విశ్వవిద్యాలయంలో 8 నెలల క్రితం డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను తాజాగా వెల్లడించారు. 8 నెలల తర్వాత ఫలితాలు వెల్లడించినప్పటికీ తప్పులు తడకగా ఉండటంపై విద్యార్థులు మండిపడుతున్నారు. 
 
మొత్తం మార్కులు 800 అయితే, పరీక్ష రాసిన విద్యార్థులందరికీ 2 వేలకు పైగా మార్కులు వచ్చాయి. ముఖ్యంగా ఓ విద్యార్థికి అయితే, ఏకంగా 5,362 మార్కులు వచ్చాయి. వీటిని చూసిన ఆ విద్యార్థి నోరెళ్లబెట్టాడు. 
 
జవాబు పత్రాల మూల్యాంకన, మార్కుల లెక్కింపులో యూనివర్శిటీ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినా అధికారులకు మాత్రం చీమకుట్టినట్టుగా కూడా లేదు. ఈ ఘటనపై యూనవర్శిటీ రిజిస్ట్రార్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, మార్కులు జాబితాలో తప్పులుంటే సవరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.