మంగళవారం, 19 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 నవంబరు 2022 (13:42 IST)

మహిళల దుస్తులపై అనుచిత వ్యాఖ్యలు.. సారీ చెప్పిన బాబా రాందేవ్

ramdev baba
మహిళల వస్త్రాధారణపై ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి పెను దుమారాన్నే రేపాయి. అనేక మంది రాజకీయ నేతలు, మహిళా సంఘాల ప్రతినిధులు రాందేవ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పైగా, మహారాష్ట్ర మహిళా కమిషన్ రాందేవ్‌కు నోటీసులు కూడా జారీచేసింది. దీంతో ఆయన దిగివచ్చి, ఒక బహిరంగ క్షమాపణ లేఖను కూడా జారీచేశారు. 
 
మహిళలను తనలాగా దుస్తులు వేసుకోకున్నా అందంగా కనిపిస్తారు అంటూ రాందేవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఫడ్నవిస్ ఎదుట మహిళలను ఉద్దేశించి ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఇవి వివాదాస్పదం కావడంతో ఆయన మహిళలకు సారీ చెబుతూ బహిరంగ లేఖ విడుదల చేశారు.