శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 నవంబరు 2022 (15:13 IST)

ప్రెగ్నెంట్‌తో ఫోటో షూట్.. మెస్సీకి మద్దతు జెర్సీ ధరించి..?

Fifa
Fifa
ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గర్భిణీ స్త్రీలతో కూడిన ఫోటో షూట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తన అభిమాన స్టార్ లియోనల్ మెస్సీకి మద్దతుగా మెటర్నిటీ ఫోటోషూట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
ప్రపంచ కప్ 2022లో ఆడనున్న మెస్సీకి ఆమె ఇలా మద్దతు ప్రకటించింది. సోఫియా రంజిత్ అనే మహిళా అభిమాని త్రిసూర్‌లోని కున్నతంగడికి చెందింది. 
 
ఈమె మెస్సీ అర్జెంటీనా జెర్సీని ధరించి తన ఫోటోషూట్ చిత్రాలకు ఫోజులిచ్చింది. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఆమె భర్త రంజిత్ లాల్ ఈ ఫోటోలను తీశారు. 
 
ఇంత అందమైన ఫోటోషూట్ ఆలోచనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోఫియా ఈ ఫోటోషూట్ చేసేందుకు చాలా ఉత్సుకతను ప్రదర్శించారు. ఖతార్ ప్రపంచ కప్‌లో   అర్జెంటీనా విజయంపై ఆమె ధీమాతో ఉన్నారు.