శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 నవంబరు 2022 (13:37 IST)

తల్లికాబోతున్న మహాలక్ష్మీ.. ఈమె ఎవరు?

Mahalakshmi
బుల్లితెర నటి మహాలక్ష్మీ వివాహం సంచలనానికి తెరతీసింది. బాగా లావుగా వున్న వ్యక్తిని ఆమె వివాహం చేసుకుంది. దీంతో అందంగా వున్న అమ్మాయి.. ఆయన్ని ఎలా పెళ్లి చేసుకుందంటూ నెట్టింట పెద్ద రచ్చే సాగింది ఆస్తి కోసమే మహాలక్ష్మీ లావాటి వ్యక్తిని పెళ్లి చేసుకుందని టాక్ వచ్చింది. ఇలా తమ గురించి ఎన్నో ట్రోలింగ్స్ వచ్చినప్పటికీ ఈ దంపతులు మాత్రం ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను తెలియపరుస్తూ వచ్చారు.
 
ఈ టాక్ అంతా కోలీవుడ్ ఇండస్ట్రీలో లిబ్రా ప్రొడక్షన్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్ గురించే. ఈయన్ని సీరియల్ నటి మహాలక్ష్మి వివాహం చేసుకుంది. సెప్టెంబర్ ఒకటవ తేదీ వీరిద్దరి వివాహం కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. 
 
ఈ దంపతుల గురించి ఒక గుడ్ న్యూస్ ప్రస్తుతం బయటికి వచ్చింది. తాజాగా వీరిద్దరూ కలిసి డిన్నర్ చేస్తున్నటువంటి ఫోటోని రవీందర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోని షేర్ చేయడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి తల్లి కాబోతున్నారా అనే వార్త చర్చలకు దారితీసింది. ఇందులో మహాలక్ష్మి కాస్త బొద్దుగా కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్త వైరల్ అయ్యింది.