గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 నవంబరు 2022 (20:28 IST)

బొంగు చికెన్‌ను వండిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్

rahul gandhi
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇటీవలే తెలంగాణను దాటుకుని మహారాష్ట్రలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ బొంగు చికెన్‌ని వండారు. 
 
తెలంగాణ ప్రజలతో కలిసి బొంగు చికెన్ వండిన ఆయన బొంగు చికెన్‌ను తానే అందరికీ వడ్డించి తాను టేస్ట్ చేశారు. ఈ అరుదైన ఘటనకు చెందిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ) శనివారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. 
 
తెలంగాణ యాత్ర ముగిస్తున్న సందర్భంగా టీపీసీసీ నేతలతో పాటు గిరిజనులతోనూ రాహుల్ గాంధీ పొలాల మధ్యన భేటీ అయ్యారు. ఆపై బొంగు చికెన్ టేస్ట్ చేశారు. 
 
మసాలా దట్టించిన చికెన్‌ను తన చేతిలోకి తీసుకున్న రాహుల్ గాంధీ… దానిని అప్పటికే సిద్ధం చేసిన బొంగుల్లో కూర్చారు.. బొంగు కూర చేశారు. నేతలతో కలిసి బొంగుల్లో నుంచి చికెన్‌ను బయటకు తీసిన రాహుల్, గిరిజనుల్లో స్వయంగా వడ్డించారు.