సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 డిశెంబరు 2022 (10:13 IST)

తొలి టెక్స్ట్ మెసేజ్‌కు 30 వసంతాలు.. తొలి సందేశం ఎవరికెళ్లిందంటే...

mobile massage
ప్రస్తుతం మొబైల్ ఫోన్‌లోనే అన్ని రకాల పనులు పూర్తిచేస్తున్నాం. కానీ, ఈ మొబైల్ ఫోన్ వచ్చిన కొత్తల్లో కేవలం ఫోన్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించేవారు. కనీసం రెండు కేజీలకు తగ్గకుండా ఉండే బరువుతో ఈ ఫోన్లు ఉండేవి కూడా. పైగా, వీటిని వెంట తీసుకెళ్లడానికి కాస్త అసౌకర్యంగా ఉన్నప్పటికీ తన బంధాను చూపించుకునేందుకు కొందరు తమ వెంట తీసుకెళ్లేవారు. 
 
ఆ తర్వాత అంటే 1992లో షార్ట్ మెసేజ్ సర్వీస్ (ఎస్ఎంఎస్) అందుబాటులోకి వచ్చింది.  వొడాఫోన్ ఇంజనీర్ ఒకరు తన బాస్‌కు తొలి ఎస్ఎంఎస్ పంపిచారు. 1992 డిసెంబరు 3వ తేదీన బెర్క్ షైర్‌కు చెందిన వొడాఫోన్ ఇంజనీర్ పాప్ వర్త్ "మెర్రీ క్రిస్మస్" అంటూ తన బాస్‌ రచర్డ్ జార్వీస్‌కు ఒక సందేశాన్ని పంపించారు. క్రిస్మస్ పార్టీకి వెళ్లిన జార్వీస్‌కు ఈ సందేశం పంపించారు. 
 
అయితే, పార్టీలో ఉండటంతో తను ఈ సందేశానికి బదులు ఇవ్వలేక పోయినట్టు జార్వీస్ చెప్పాడు. ఆ తర్వాత కాలక్రమంలో ఎస్ఎంఎస్ ఇంత ప్రాచూర్యం లభిస్తుందని ఊహించలేదంటూ జార్వీస్ అభిప్రాయపడ్డారు.