ఆదివారం, 10 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 డిశెంబరు 2021 (09:33 IST)

తెరుచుకున్న అయ్యప్ప ఆలయం తలుపులు - 14న మకర జ్యోతి

పవిత్ర పుణ్యక్షేత్రంగా ఉన్న శబరిమల అయ్యప్ప ఆలయం తలుపులు గురువారం సాయంత్రం నుంచి తెరుచుకున్నాయి. మళ్లీ జనవరి 19వ తేదీ వరకు ఆలయాన్ని తెరిచివుంచుతారు. జనవరి 14వ తేదీన మకర జ్యోతి దర్శనం ఉంటుంది. ఇందుకోసం నీలక్కర్, ఎరుమేలి వద్ద స్పాట్ బుకింగ్స్ సౌకర్యాన్ని ఆలయాన్ని అధికారులు ఏర్పాటుచేశారు. 
 
ఆలయ తలుపులు గురువారం సాయంత్రం తెరిచినప్పటికీ శుక్రవారం ఉదయం 5 గంటల నుంచే భక్తులను అయ్యప్ప స్వామి దర్శన కల్పించారు. ఎరుమేలి నుంచి ఉదయం ఐదున్నర గంటల నుంచి రాత్రి పదిన్నర మధ్య మార్గంలో భక్తులను అనుమతిస్తున్నారు. 
 
స్వామి దర్శనానికి వచ్చే భక్తులు విధగా కరోనా టీకా రెండు డోసులు వేసుకున్నట్టుగా నిర్ధారించే సర్టిఫికేట్‌ను తమ వెంట తీసుకుని రావాలని ఆయన కోరారు. జనవరి 19వ తేదీన ఆలయాన్ని మూసివేస్తారు.