గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్

మాతాజీ - పితాజీల కంటే ఏ "జీ" గొప్పది కాదు : ముఖేశ్ అంబానీ

mukesh ambani
ప్రతి ఒక్కరి జీవితాల్లో అమ్మానాన్నలే గొప్ప అని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. మాతాజీ, పితాజీ కంటే 4జీ, 5జీలు గొప్పది కాదన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని పండిట్ దీన దయాళ్ ఎనర్జీ యూనివర్శిటీ స్నాతకోత్సవం కార్యక్రమం జరిగింది. ఇందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఇది మీ రోజని, మీరేంటో ప్రపంచానికి తెలిసే రోజన్నారు. అయినప్పటికీ మీరు నిల్చున్నది మీ తల్లిదండ్రుల రెక్కలపై అని చెప్పారు. మీ తల్లిదండ్రులకు కూడా ఈ రోజు ప్రత్యేకమైనదన్నారు. 
 
మిమ్మల్ని ఇక్కడికి వరకు తీసుకురావడానికి మీ తల్లిదండ్రులు చేసిన త్యాగాలను, వారు పడిన శ్రమను మరిచిపోవద్దన్నారు. మీకు వాళ్లు ఎపుడూ అండగా ఉంటారన్నారు. మీ బలానికి మూలస్తంభాలు వారేనని చెప్పారు. 
 
ప్రస్తుతం యుత 4జీ, 5జీల గురించి ఉత్సాహంగా ఉన్నారన్నారు. కానీ, మాతాజీ, పితాజీల టంకే ఏ జీ గొప్పది కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని ఆయన హితవు పలికారు.