సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 14 డిశెంబరు 2022 (09:22 IST)

ఈవో ధర్మారెడ్డికి జైలుశిక్షి విధించిన హైకోర్టు.. నేడు అప్పీలు

dharma reddy
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ఎగ్జిక్యూటివ్ అధికారి ధర్మారెడ్డికి కోర్టు ధిక్కరణ చర్యల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఒక నెల జైలుశిక్షను విధిస్తూ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు మంగళవారం సంచలన తీర్పునిచ్చింది. జైలుశిక్షతో పాటు రూ.2 వేల అపరాధం కూడా విధించింది. పైగా అపరాధం చెల్లించని పక్షంలో మరికొన్ని రోజులు జైలుశిక్ష అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించింది. అయితే, ఈ తీర్పుపై బుధవారం అప్పీల్ చేయాలని తితిదే భావిస్తుంది. అప్పీలు పిటిషన్‌పై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.
 
తితిదేలోని ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులను గతంలో తమ సర్వీసుల క్రమబద్దీకరణపై హైకోర్టును ఆశ్రయించారు. ఆ ముగ్గురు సర్వీసులను క్రమబద్దీకరించాలని అప్పట్లో హైకోర్టు ఆదేశాలుజారీచేసింది. కానీ, వాటిని తితిదే అమలు చేయలేదు. దీంతో బాధిత ఉద్యోగులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. తమ ఆదేశాలను తితిదే అమలు చేయనందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈవోగా పని చేస్తున్న ధర్మారెడ్డి నెల రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.