1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2022 (11:30 IST)

తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి?

bhumana karunakar reddy
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని నియమించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. పాలకమండలిలో సైతం కీలక మార్పులు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. తితిదే కొత్త ఛైర్మన్, పాలక మండలి సంక్రాంతి తర్వాత బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంది. 
 
వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలను గెలవాలనే పట్టుదలతో జగన్ ఉన్న సంగతి తెల్సిందే. అన్ని సీట్లను గెలుచుకునే విధంగా ఇప్పటికే ఆయన పార్టీ నేతలను మార్గనిర్దేశం చేస్తున్నారు. ప్రస్తుతం తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీలో బాధ్యతలను జగన్ అప్పగించారు. ఇపుడు ఆయనకు ఉత్తరాంధ్రకు బాధ్యతలను పూర్తి స్థాయిలో కట్టబెట్టాలని జగన్ భావిస్తున్నారు.
 
ఈ క్రమంలో తితిదే బాధ్యతల నుంచి తప్పించి పూర్తి స్థాయిలో పార్టీ కార్యాలయాలపై సుబ్బారెడ్డి ఫోకస్ చేసేలా జగన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. టీడీపీకి కంచుకోటగా ఉండే ఉత్తరాంధ్రలో గత ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించింది. ఆ పట్టు సడలకుండా ఉండేందుకు వీలుగా సీనియర్ రాజకీయ నేతగా ఉన్న సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్గపగి