బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2022 (14:31 IST)

గొల్లపూడిలో జగన్ పుట్టినరోజు వేడుకలు..

jagan
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్సార్‌సీపీ నేతలు విజయవాడలోని గొల్లపూడిలో ఘనంగా నిర్వహించారు. 
 
సీఎం వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి 600 కిలోల కేక్‌ కట్‌ చేశారు. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఈ మైలురాయి సెంటర్ నుండి గ్రామ సచివాలయం వరకు భారీ కేక్‌తో భారీ ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, అనిల్ కుమార్, ఎంపీ నందిగం సురేష్ తదితరులు హాజరయ్యారు.